IPL 2023: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ .. మరోవారం రోజులు జట్టుకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ ..

సీఎస్‌కే జట్టుకు ఎస్ఎస్ ధోనీ సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు. మరోవైపు గాయంతోనూ బాధపడుతున్నాడు. ఒకవేళ ధోనీ మోకాలి గాయం తీవ్రమైతే పరిస్థితి ఏమిటనేది ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.

IPL 2023: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ .. మరోవారం రోజులు జట్టుకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ ..

Ben Stokes

IPL 2023: ఐపీఎల్-2023 సీజన్‌లో జట్ల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. చివరి బంతి వరకు గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా  మ్యాచ్‍లు తిలకిస్తున్నారు. ఎంఎస్ ధోనీ సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మెరుగైన ప్రదర్శన ఇస్తుంది. ఇప్పటి వరకు ఆ జట్టు ఆరు మ్యాచ్‌లు ఆడగా.. అందులో నాలుగు విజయాలు ఉన్నాయి. పాయింట్ల పట్టికలో సీఎస్‌కే జట్టు మూడో స్థానంలో ఉంది. అయితే, ఆ జట్టును ఆటగాళ్ల గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే ఆ జట్టు నుంచి ఐదుగురు కీలక ఆటగాళ్లు గాయం కారణంగా తుది జట్టులోకి ఎంపిక కావటం లేదు. తాజాగా ఇంగ్లాండ్ ఆల్‌‌రౌండ్ క్రికెటర్ బెన్‌స్టోక్స్ సైతం మరో వారంపాటు జట్టుకు దూరంగా ఉండనున్నారు. ఈ విషయాన్ని జట్టు ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు.

IPL 2023, CSK vs SRH: కాన్వే జోరు.. హైద‌రాబాద్ బేజారు

శుక్రవారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో సీఎస్‌కే జట్టు తలపడింది. ఎస్ఆర్‌హెచ్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. అనంతరం 18.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి సీఎస్‌కే జట్టు విజయం సాధించింది. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్, ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ ఈ మ్యాచ్ లో ఆడతారని భావించినప్పటికీ గాయం తీవ్రం కావడంతో మరోవారం విశ్రాంతిని ఇవ్వడం జరిగిందని కోచ్ స్లీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు. సీఎస్‌కే జట్టు బెన్‌స్టోక్స్‌ను గతేడాది జరిగిన మినీ వేలంలో  రూ. 16.25 కోట్లకు దక్కించుకుంది.

IPL 2023: ఐపీఎల్ ప్లే ఆఫ్స్ షెడ్యూల్ విడుద‌ల‌.. ఫైన‌ల్ మ్యాచ్ ఎక్క‌డంటే..?

గాయాల కారణంగా సీఎస్‌కే జట్టు నుంచి ఇప్పటికే దీపక్ చాహర్,  సిసంద మగలా రెండు వారాలు, జట్టుకు దూరమయ్యారు. వీరితో పాటు సిమ్రంజీత్ సింగ్ గాయం నుండి కోలుకుంటున్నాడు. ముఖేష్ చౌదరి, కైల్ జెమిసన్ ఐపీఎల్ నుంచి తప్పుకున్నారు. మతీషా పతిరణ కొవిడ్ -19 కారణంగా మ్యాచ్ కు దూరమయ్యాడు. కొద్దిరోజులు జట్టుకు అందుబాటులో ఉండడు. ఎస్ఎస్ ధోనీ కూడా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ, ప్రస్తుతం జట్టుకు సారథ్య బాధ్యతలు వహిస్తున్నాడు.

 

ఒకవేళ ధోనీ మోకాలి గాయం తీవ్రమైతే పరిస్థితి ఏమిటనేది సీఎస్‌కే జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ ధోనీ గాయం తీవ్రమైతే కాన్వే కీపర్ గా ఉంటాడు. ధోనీ ఇంపాక్ట్ సబ్ గా రావచ్చు. అయితే, కెప్టెన్సీ ఎవరన్నది ప్రశ్నగా మారింది. గత ఐపీఎల్ సమయంలో ధోనీ అందుబాటులో లేకపోవటంతో జడేజా కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు.