David Warner : నెద‌ర్లాండ్స్ పై వార్న‌ర్ విధ్వంసం.. స‌చిన్ రికార్డు స‌మం.. ప‌లు రికార్డులు బ్రేక్‌..

ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును స‌మం చేశాడు. అదే స‌మ‌యంలో దిగ్గ‌జ ఆట‌గాళ్లు రికీ పాంటింగ్‌, కుమార సంగ‌క్క‌ర రికార్డుల‌ను బ్రేక్ చేశాడు.

David Warner : నెద‌ర్లాండ్స్ పై వార్న‌ర్ విధ్వంసం.. స‌చిన్ రికార్డు స‌మం.. ప‌లు రికార్డులు బ్రేక్‌..

Sachin Tendulkar-David Warner

David Warner-Sachin Tendulkar : ఆస్ట్రేలియా ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును స‌మం చేశాడు. అదే స‌మ‌యంలో దిగ్గ‌జ ఆట‌గాళ్లు రికీ పాంటింగ్‌, కుమార సంగ‌క్క‌ర రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో నెద‌ర్లాండ్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో డేవిడ్ వార్న‌ర్ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో వార్న‌ర్ 91 బంతుల్లో సెంచ‌రీ చేశాడు. వ‌న్డేల్లో అత‌డికి ఇది 22వ శ‌త‌కం కాగా.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇది ఆరో సెంచ‌రీ కావ‌డం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్‌లో వార్న‌ర్ 93 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్స‌ర్లతో 104 ప‌రుగులు చేశాడు.

సచిన్ రికార్డు స‌మం..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో అత్య‌ధిక శ‌త‌కాలు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో క్రికెట్ దేవుడు స‌చిన్ టెండూల్క‌ర్ ఆరు శ‌త‌కాల‌తో రెండో స్థానం ఉన్నాడు. నెద‌ర్లాండ్స్‌తో మ్యాచ్‌లో శ‌త‌కం చేయ‌డం ద్వారా స‌చిన్ రికార్డును డేవిడ్ వార్న‌ర్ స‌మం చేశాడు. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు రికీ పాంటింగ్ (5 శ‌త‌కాలు), శ్రీలంక దిగ్గ‌జ ఆట‌గాడు కుమార సంగ‌క్క‌ర (5శ‌త‌కాల‌) రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టాడు. ఈ జాబితాలో భార‌త కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ 7 సెంచ‌రీల‌తో అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Babar Azam : అఫ్గానిస్థాన్ పై పాక్ ఓట‌మి.. బాబ‌ర్ కెప్టెన్సీ గోవిందా..!

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా రెండు సెంచరీలు..

నెద‌ర్లాండ్స్‌పై సెంచ‌రీ చేయ‌డం ద్వారా డేవిడ్ వార్న‌ర్ అరుదైన ఘ‌నత సాధించాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచుల్లో శ‌త‌కం చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంత‌క‌ముందు పాకిస్థాన్ పై 124 బంతుల్లో 163 ప‌రుగులు చేశాడు. ఆస్ట్రేలియా త‌రుపున ఈ ఘ‌న‌త సాధించిన నాలుగో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. వార్న‌ర్ క‌న్నా ముందు మార్క్‌వా, రికీ పాంటింగ్‌, మాథ్యూ హేడెన్ లు ఇలా వ‌రుస‌గా రెండు ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచుల్లో శ‌త‌కాలు బాదారు.

మూడో స్థానం..

వ‌న్డేల్లో 22 సెంచ‌రీల‌ను అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో చేసిన ఆట‌గాళ్ల జాబితాలో వార్న‌ర్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ క్ర‌మంలో డివిలియ‌ర్స్‌, రోహిత్ శ‌ర్మ రికార్డుల‌ను బ్రేక్ చేశాడు. వార్న‌ర్ వ‌న్డేల్లో 22 సెంచ‌రీలను 153 ఇన్నింగ్స్‌ల్లో చేయ‌గా.. ఏబీ డివిలియ‌ర్స్ కు 186 ఇన్నింగ్స్‌లు, రోహిత్ శ‌ర్మ‌కు 188 ఇన్నింగ్స్‌లు అవ‌స‌రం అయ్యాయి. 126 ఇన్నింగ్స్‌ల్లో 22 సెంచ‌రీ చేయ‌డం ద్వారా ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు హ‌షీమ్ ఆమ్లా ఈ జాబితాలో అగ్ర‌స్థానంలో ఉండ‌గా భార‌త ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ(143 ఇన్నింగ్స్‌) రెండో స్థానంలో ఉన్నాడు.

Irfan Pathan: పాకిస్థాన్ పై అఫ్గానిస్తాన్ విజయం.. ఇర్ఫాన్ పఠాన్ ఎందుకలా డాన్స్ చేశాడు?

అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో 22 వ‌న్డే సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు..

హషీమ్ ఆమ్లా (ద‌క్షిణాఫ్రికా) – 126 ఇన్నింగ్స్‌ల్లో
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 143 ఇన్నింగ్స్‌ల్లో
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) – 153 ఇన్నింగ్స్‌ల్లో
ఏబీ డివిలియర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 186 ఇన్నింగ్స్‌ల్లో
రోహిత్ శర్మ (భార‌త్‌) – 188 ఇన్నింగ్స్‌ల్లో