వచ్చాడు హీరో: వార్నర్ తిరిగి రావడం చాలా సంతోషం

వచ్చాడు హీరో: వార్నర్ తిరిగి రావడం చాలా సంతోషం

ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ జరగడంతో నిషేదానికి గురైయ్యాడు డేవిడ్ వార్నర్. ఆ ప్రభావంతో ఐపీఎల్ కూడా అతణ్ని దూరం పెట్టేసింది. 2018 సీజన్‌కు వార్నర్ లేకుండానే బరిలోకి దిగి ఫైనల్ వరకూ వెళ్లింది సన్‌రైజర్స్ హైదరాబాద్‌. 2019లో తమ స్టార్ బ్యాట్స్‌మన్ వార్నర్ పునరాగమనంతో మరింత సాధించగలమనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది సన్‌రైజర్స్.

ఈ మేర హైదరాబాద్ జట్టు ప్లేయర్ బాసిల్ థంపి వార్నర్ తిరిగి రావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ‘ప్రతి ఒక్కరికి చాలా సంతోషంగా ఉంది. చివరి సీజన్‌లో అతను జట్టుకు దూరంగా ఉన్నాడు. బాగా మిస్సయ్యాం. కెప్టెన్సీ బాధ్యతలను కేన్ విలియమ్సన్ చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సీజన్ మొత్తం మాతోనే ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 

‘అతను జట్టులో ఉంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. మిగిలిన ఆటగాళ్లపై ఒత్తిడి ఉండదు. ఇప్పటి గురించే కాదు. ప్రతి మ్యాచ్‌లోనూ అలాగే ఉంటుంది’ అని సన్‌రైజర్స్ యువ క్రికెటర్ బాసిల్ థంపీ అభిప్రాయపడ్డాడు. థంపీ ఐపీఎల్ 2017సీజన్లో గుజరాత్ లయన్స్ జట్టులో ఆడి 12 మ్యాచ్‌ల్లో 11వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.