Yogesh Parmar: టీమిండియా ఫిజియోకు కరోనా… ఫైనల్ టెస్టు డౌటే..!

ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టిస్తున్న టీమిండియా జ‌ట్టులోని స‌పోర్ట్ స్టాఫ్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Yogesh Parmar: టీమిండియా ఫిజియోకు కరోనా… ఫైనల్ టెస్టు డౌటే..!

Final Test In Doubt As Team India Physio Tests Positive (1)

Team India’s physio tests positive : ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టిస్తున్న భార‌త క్రికెట్ జ‌ట్టులోని స‌పోర్ట్ స్టాఫ్‌కు క‌రోనా వైర‌స్ సోకింది. జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా బారిన పడ్డాడు. అతడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో టీమిండియా ప్రాక్టీష్ సెషన్ రద్దు అయినట్టు బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి. షెడ్యూల్ ప్రకారం.. ఓల్డ్ ట్రాఫ‌ర్డ్‌లో శుక్రవారం నుంచి ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు జరగాల్సి ఉంది. ఇప్పుడా ఫైనల్ టెస్టు జ‌ర‌గుతుందా లేదో అనుమానంగా ఉంది. ఇదివరకే జట్టు ప్రధాన ఫిజయో నితిన్ పటేల్ ఐసోలేషన్ లో ఉన్నాడు. ఇప్పుడు కరోనా పాజిటివ్ తేలడంతో ఫిజియో పార్మార్ కూడా జట్టును వీడాడు. అంతకుముందే ఓవల్ టెస్టు సమయంలో భార‌త కోచ్ ర‌విశాస్త్రికి కూడా క‌రోనా వైర‌స్ సోకింది. ఫిజియోను మీరే చూడాలని బీసీసీఐ.. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డును కోరినట్టు తెలిసింది.

RT-PCR టెస్టుల ఫలితాల తర్వాతే మ్యాచ్ ఉంటుందా లేదో నిర్ణయించే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోచ్‌లకు పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఆటగాళ్లందరికి RT-PCR ప‌రీక్ష‌లు చేయించారు. మాంచెస్ట‌ర్‌లో జ‌ట్టు స‌భ్యుల‌తో సంప్ర‌దించిన బీసీసీఐ.. ఓల్డ్ ట్రాఫ‌ర్డ్ టెస్టును ర‌ద్దు చేయాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కరోనా టెస్టులు జరుగుతున్న సమయంలో ఆటగాళ్లంతా తమ గదుల్లోనే ఉండాలని సూచించింది. రవిశాస్త్రి, పటేల్ సహా ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా లండన్ లో ఐసోలేషన్ లో ఉన్నారు. ఐదో రోజు ఓవల్‌లో జరిగిన నాల్గో టెస్టులో టీమిండియా గెలిచింది. ఈ మ్యాచ్ సమయంలో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మాత్రమే జట్టుతో ఉన్నాడు.
MS Dhoni : మెంటర్ గా ధోనీ..బీసీసీఐకి ఫిర్యాదు అందిందా ? ఎందుకు ?

అయితే, ఆటగాళ్లతో పాటు సపోర్టు టీమ్ కూడా పూర్తి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఓ హోటల్ లో జరిగిన బుక్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ర‌విశాస్త్రితో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు. అక్కడి హోటల్లో బయటి వ్యక్తులకు కూడా అనుమతి ఉంది. ఈ కార్యక్రమంలో ర‌విశాస్త్రితోపాటు భ‌ర‌త్ అరున్‌, ఆర్ శ్రీధ‌ర్‌లు కూడా పాల్గొన్నారు. వీరిలో రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ తేలడంతో వీరిద్దరూ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ట్టులోని ప్లేయ‌ర్ల‌కు ఎవ్వ‌రికీ వైర‌స్ సంక్రమించలేదు.

స‌పోర్ట్ స్టాఫ్‌తో స‌న్నిహితంగా ఉండటంతో ముందుస్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఐదో టెస్టుల సిరీస్‌లో భార‌త్ 2-1 తేడాతో ఆధిక్యంలో కొనసాగుతోంది. సెప్టెంబ‌ర్ 19వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో.. ఐపీఎల్ టోర్న‌మెంట్‌పై ఎలాంటి ప్ర‌భావం పడకూడదని బీసీసీఐ భావిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం అయ్యే ఐదో ఆఖరి టెస్టు అసలు మొదలవుతుందో లేదో అనుమానంగా ఉంది.
T20 World Cup : టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ఇదే.. మెంటర్‌గా ధోనీ