Shoaib Akhtar: విరాట్ కోహ్లీ‌పై పాక్ మాజీ పేసర్ ప్రశంసల వర్షం.. సచిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ముగించే సమయానికి 110 సెంచరీలు చేస్తాడని, అతనిలో ఆ సత్తా ఉందంటూ అక్తర్ అన్నారు.

Shoaib Akhtar: విరాట్ కోహ్లీ‌పై పాక్ మాజీ పేసర్ ప్రశంసల వర్షం.. సచిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు

Shoaib Akhtar

Shoaib Akhtar: పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ముగించే సమయానికి 110 సెంచరీలు చేస్తాడని, అతనిలో ఆ సత్తా ఉందంటూ అక్తర్ అన్నారు. ఇటీవల జరిగిన ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో 1205 రోజుల తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌లో 28వ సెంచరీ చేశాడు. 2019లో బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ 27వ సెంచరీ చేశాడు. 28వ సెంచరీ చేయడానికి కోహ్లీ 41 ఇన్నింగ్స్ ఆడాడు.

Virat Kohli 28th Test Ton: కోహ్లి ఈజ్ బ్యాక్.. 6 నెలల్లో 5 ఇంటర్నేషనల్ సెంచరీలు.. ఫ్యాన్స్ ఫుల్ జోష్..

విరాట్ కోహ్లీ ఇండియా, ఆస్ట్రేలియా నాలుగో టెస్టులో 186 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ డ్రా అయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా వెళ్ళడంలో కోహ్లీ కీలక భూమిక పోషించారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో కలిపి 75 సెంచరీలతో ఉన్నాడు. సచిన్ టెండుల్కర్ 100 సెంచరీలు చేశాడు. తాజాగా కోహ్లీ ఫాంలోకి రావడం పట్ల షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ మళ్లీ ఫాంలోకి రావడం నాకు కొత్తేమీ అనిపించలేదు. అయితే, గతంలో కెప్టెన్సీ ఒత్తిడి అతనిపై ఉంది. చివరకు అతను మానసికంగా స్వేచ్ఛగా ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ చాలా ఫోకస్‌తో ఆడుతున్నాడు. అతనిపై నాకు పూర్తినమ్మకం ఉంది, 110 సెంచరీలు చేసి సచిన్ టెండుల్కర్ 100 సెంచరీలు రికార్డును బద్దలు కొట్టడతాడు అంటూ షోయబ్ పేర్కొన్నారు.

Virat Kohli: జూలు విదిల్చిన విరాట్ కోహ్లీ.. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. టెస్టులో 28వ సెంచరీ నమోదు..

కోహ్లీపై ప్రస్తుతం కెప్టెన్సీ భారంలేకపోవటంతో పరుగుల వరద పారిస్తున్నాడు అంటూ ప్రశంసించాడు. అదేవిధంగా సచిన్ గురించి షోయబ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కెరీర్‌లో సచిన్ వికెట్ తనకు ఇష్టమైన వికెట్ అని రావల్పిండి ఎక్స్‌ప్రెస్ అన్నాడు. నేను సచిన్ వికెట్ తీస్తానని నా సహచరులకు ఒకసారి చెప్పినట్లు నాకు గుర్తుంది. ఆ సమయంలో మేము కోల్ కతాలో ఆడుతున్నాం. మొదటి బంతికే నేను సచిన్ వికెట్ తీశాను. ఆ స్టేడియంలో లక్ష మంది వరకు ప్రేక్షకులు ఉన్నారు. సచిన్ వికెట్ పడిపోగానే స్టేడియం సగం ఖాళీ అయింది. ఆ ఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది అంటూ అక్తర్ చెప్పారు.