టీమిండియా తొలి వికెట్, సెంచరీతో నిలిచిన ధావన్

టీమిండియా తొలి వికెట్, సెంచరీతో నిలిచిన ధావన్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న 4వ వన్డేలో టీమిండియా దూకుడుగా ఆడుతోంది. 30 ఓవర్లు వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆడిన భారత్ తొలి వికెట్‌గా రోహిత్‌(95)ను కోల్పోయింది. సెంచరీకి ముందు రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో హ్యాండ్స్‌కాంబ్ క్యాచ్ అందుకుని పెవిలియన్‌కు పంపారు. 

అంతేకాకుండా, భారత్ అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. టీమిండియా ఓపెనర్లుగా రోహిత్(95), ధావన్(102*)తో రికార్డు నెలకొల్పారు. గతంలో సొంతగడ్డపై అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదుచేసిన తమ రికార్డును తామే దాటేశారు. రికార్డుల జాబితాను ఓ సారి పరిశీలిస్తే.. 

  • 2019లో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్, మొహాలీ వేదికగా 193
  • 2013లో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్, నాగ్‌పూర్ వేదికగా 178
  • 2013లో రోహిత్ శర్మ- శిఖర్ ధావన్, జైపూర్ వేదికగా 176
  • 1998లో సచిన్ టెండూల్కర్- సౌరవ్ గంగూలీ, కాన్పూర్ వేదికగా 175