Hyderabad T20 Match Tickets : రూ.850 టిక్కెట్ రూ11 వేలకు అమ్మకం.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా

క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. టిక్కెట్లను భారీ ధరకు అమ్ముకుని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

Hyderabad T20 Match Tickets : రూ.850 టిక్కెట్ రూ11 వేలకు అమ్మకం.. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా

Hyderabad T20 Match Tickets Black Market : ఆదివారం.. ఆహ్లాదకరమైన సాయంత్రం. అద్భుతమైన స్టేడియం. సూపర్ స్టార్లతో కూడిన రెండు పెద్ద జట్ల మధ్య టీ20 ఫైట్. అందులోనూ సిరీస్ డిసైడర్. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇంతకంటే ఎంజాయ్ మెంట్ ఏముంటుంది. స్టేడియంలో మ్యాచ్ ను లైవ్ లో చూస్తే వచ్చే కిక్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు క్రికెట్ లవర్స్.

అంతర్జాతీయ మ్యాచ్ కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు టీ20 ఫైట్ ను ఆస్వాదించడానికి ఇంతకంటే గొప్ప రోజేం ఉంటుంది. ఆదివారం సాయంత్రం 7గంటలకు ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆసీస్ మధ్య జరిగే ఆఖరి టీ20 మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ఓవైపు క్రికెట్ లవర్స్ కోలాహలం, మరోవైపు బెట్టింగ్ బంగార్రాజుల హడావుడి, ఇంకోవైపు.. బ్లాక్ టిక్కెట్ల దందా. క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. టిక్కెట్లను భారీ ధరకు అమ్ముకుని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.

క్రికెట్ మ్యాచ్ జరిగే ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టిక్కెట్ల దందాకు ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు చెక్ పెట్టారు. క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 6 టిక్కెట్లు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్ ను రూ.850కి కొన్న నిందితులు.. వాటిని రూ.11వేలకు అమ్ముకుంటున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ముగ్గురు నిందితులు వెంకటేశ్, దయాకర్, అరుణ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.