Kapil Dev: ‘నాకు రవీంద్ర జడేజా ఆటంటే ఇష్టం’

ఇండియా లెజెండ్ కపిల్ దేవ్ టీమిండియా ప్రస్తుత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తెగ పొగిడేస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి టెస్టులో జడేజా బ్యాటింగ్ లో, బౌలింగ్ లో...

Kapil Dev: ‘నాకు రవీంద్ర జడేజా ఆటంటే ఇష్టం’

Kapil Dev

Kapil Dev: ఇండియా లెజెండ్ కపిల్ దేవ్ టీమిండియా ప్రస్తుత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తెగ పొగిడేస్తున్నాడు. ఇటీవల ముగిసిన ఇండియా వర్సెస్ శ్రీలంక తొలి టెస్టులో జడేజా బ్యాటింగ్ లో, బౌలింగ్ లో అసాధారణ ప్రతిభ చూపించాడు. బ్యాట్స్‌మన్‌గా 175 పరుగులు చేసి, బౌలర్‌గా 9వికెట్లు పడగొట్టాడు. ఈ యువ క్రికెటర్ పర్‌ఫార్మెన్స్ తనను బాగా ఆకట్టుకుందని కపిల్ దేవ్ అంటున్నాడు.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్లలో జడేజా నెం.1 స్పాట్ చేరుకున్నాడు. శ్రీలంకతో మొహాలీ వేదికగా చారిత్రక విజయాన్ని నమోదు చేశాడు.

ఒక్క ఇన్నింగ్స్‌లోనే నెం.7లో బ్యాటింగ్‌కు దిగి 175 పరుగులతో కపిల్ దేవ్ అత్యధిక టెస్టు స్కోరు నమోదు చేసి కపిల్ దేవ్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఫలితంగా 222 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలకంగా నిలిచాడు.

Read Also: కపిల్ దేవ్ 35ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన జడేజా

‘నాకు రవీంద్ర జడేజా ఆటతీరు అంటే చాలా ఇష్టం. యువ క్రికెటర్లలో ఒత్తిడి తీసుకోకుండా ఆడే ప్లేయర్ జడేజా. క్రికెట్ ను చాలా ఎంజాయ్ చేస్తాడు. అందుకే అతని బ్యాటింగ్, బౌలింగ్ అంత బాగుంటాయి. ఫీల్డింగ్ లోనూ గ్రేట్ గా కనిపిస్తాడు. ఒత్తిడి ఫీలవుతుంటే ఎప్పుడూ సరిగా ఆడలేం. అలాంటప్పుడు ఫీల్డ్ లో మన ప్రదర్శన కూడా నీరుగారిపోతుంది’ అని కపిల్ దేవ్ ప్రత్యేక ఈవెంట్ లో మాట్లాడుతూ అన్నారు.