హమిల్టన్ టీ20 : భారత్-కివీస్ మ్యాచ్ టై.. Super Overతో తేలనున్న ఫలితం

10TV Telugu News

హమిల్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన మూడో టీ20 టై అయ్యింది. 180 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్..20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ షమీ ఫైనల్ ఓవర్ ని అద్భుతంగా బౌల్ చేశాడు. చివరి బంతికి టేలర్ ను బౌల్డ్ చేశాడు. దీంతో మ్యాచ్ టై అయ్యింది.

సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెల్చిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన కోహ్లి సేన.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

* ఉత్కంఠభరితంగా సాగిన 3వ టీ-20
* భారత్-కివీస్ టీ-20 మ్యాచ్ టై
* ఉత్కంఠపోరులో టై గా ముగిసిన మ్యాచ్
* న్యూజిలాండ్ కు 180 పరుగుల టార్గెట్ పెట్టిన భారత్

* 20 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేసిన కివీస్
* సూపర్ ఓవర్ తో తేలనున్న ఫలితం
* ఈ సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా
* ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ భారత్ కైవసం