టీమిండియాకు ఓటమి తప్పదు.. అవన్నీ పాత టెక్నిక్స్

టీమిండియాకు ఓటమి తప్పదు.. అవన్నీ పాత టెక్నిక్స్

India vs Australia: తొమ్మిది నెలల తర్వాత జరిగిన తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకుంది. ఓవర్ల మధ్యలో పరుగులు విచ్ఛలవిడిగా వదిలేయడంతో విజయం అందనంత దూరంలో నిలిచింది. 66పరుగుల తేడాతో ఓడిపోయిన టీమిండియాపై మైకెల్ వాన్ ట్విట్టర్ వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ సారి టీమిండియా అన్ని ఫార్మాట్లలోనూ ఆస్ట్రేలియాతో ఓటమిని ఎదుర్కోవాల్సిందే. ఐదు స్పెషలిస్టు బౌలర్లతో ఓల్డ్ స్కూల్ మెంటాలిటీ చూపిస్తుందని శుక్రవారం ట్వీట్ చేశారు. ఐదుగురు బౌలర్లను తీసుకుని, బ్యాటింగ్ తో ఏం రాణించగలదని భావించిందో అంటూ సెటైర్ వేశారు.



ఐపీఎల్‌లో ఆడిన తమ ప్లేయర్లు ఆస్ట్రేలియా జట్టుకు ఆడుతూ సిడ్నీ వేదికగా మెరుపులు కురిపించారు. ఫలితంగా ఆసీస్ ఇండియా ముందు 375 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్ సెంచరీలకు వార్నర్ స్కోరు తోడైంది. టీమిండియా బ్యాటింగ్ విభాగంలో ఆశించినంత మేర రాణించకపోవడంతో 8వికెట్లు నష్టపోయి కేవలం 308పరుగులు మాత్రమే చేయగలిగింది.
https://10tv.in/sachin-tendulkar-loses-his-way-in-mumbai-lanes/
‘డిఫెన్సివ్ బాడీ లాంగ్వేజ్‌కు తోడు, ఫీల్డింగ్‌లోనూ షాక్ తెప్పించారు. కేవలం ఆర్డినరీ బౌలింగ్ తో ఆడారు. మరోవైపు ఆస్ట్రేలియా అవుట్ స్టాండింగ్ పర్‌ఫార్మెన్స్ చేసింది. ఇండియా లాంగ్ టూర్ ఇలానే ఉంటుందా’ అని ట్వీట్ పెట్టారు.