భారత్‌తో మూడో వన్డే : టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ 

  • Published By: sreehari ,Published On : February 11, 2020 / 02:02 AM IST
భారత్‌తో మూడో వన్డే : టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ 

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది.

కేదార్ జాదవ్ స్థానంలో మనీష్ పాండేకు జట్టులో చోటు దక్కింది. గాయంతో కొన్ని మ్యాచ్ లకు దూరమైన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫిటెనెస్ సాధించి తిరిగి జట్టులోకి వచ్చేశాడు. ఇప్పటికే 0-2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఈ ఆఖరిమ్యాచ్ లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.

మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఆఖరి వన్డేలో గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని తెగ ఆరాపడుతోంది. భారత ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. టిమ్ సౌథీ తొలి ఓవర్ అందుకున్నాడు. 

భారత జట్టు : 
మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్) , జడేజా, మనీష్ పాండే, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్, సైని, బుమ్రా

న్యూజిలాండ్ : 
మార్టిన్ గప్తిల్, నికోల్స్, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లేథమ్ (వికెట్ కీపర్) , నీషమ్, గ్రాండ్ హోమ్, టిమ్ సౌథీ, కైల్ జేమీసన్, శాంట్నర్, బెనెట్  మౌంట్ మౌంగనుయ్