India Beats Zimbabwe : ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై భారత్‌దే విజయం.. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

జింబాబ్వేతో నామమాత్రపు మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. కాగా, విజయం కోసం టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై 13 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది.

India Beats Zimbabwe : ఉత్కంఠ పోరులో జింబాబ్వేపై భారత్‌దే విజయం.. వన్డే సిరీస్ క్లీన్ స్వీప్

India Beats Zimbabwe : జింబాబ్వేతో నామమాత్రపు మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది. కాగా, విజయం కోసం టీమిండియా చెమటోడ్చాల్సి వచ్చింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై 13 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన భారత్.. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. 290 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే పోరాడి ఓడింది. 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది.

జింబాబ్వే బ్యాటర్‌ సికిందర్ రజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సెంచరీతో కదం తొక్కాడు. రజా 95 బంతుల్లో 115 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. రజా రెచ్చిపోయి ఆడాడు. జట్టుని గెలిపించినంత పని చేశాడు. జట్టుని విజయానికి చేరువగా తీసుకొచ్చాడు. అయితే, చివర్లో ఔట్ కావడంతో జింబాబ్వేకి ఓటమి తప్పలేదు. రజా సెంచరీ వృథా అయింది. రజా అద్భుత శతకంతో జట్టుని ఆదుకున్నా విజయాన్ని మాత్రం అందిచంలేకపోయాడు.  భారత బౌలర్లలో అవేశ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. దీపక్ చాహర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఒక వికెట్ తీశాడు.

టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు తన కల నెరవేర్చకున్నాడు. వన్డేల్లో తన తొలి సెంచరీ సాధించాడు. జింబాబ్వేతో మూడో వన్డేలో చెలరేగిన గిల్.. 82 బంతుల్లోనే మెరుపు శతకం బాదేశాడు. తద్వారా తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 97 బంతుల్లో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

 

అదరగొట్టిన అక్షర్…

గిల్ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. ధావన్ 40, రాహుల్ 30 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఆ తర్వాత గిల్, ఇషాన్ కిషన్ (50) జోడీ జింబాబ్వే బౌలింగ్ ను ఉతికారేసింది. గిల్, కిషన్ జోడీ విజృంభణతో భారత్ స్కోరు 200 మార్కు దాటింది. దీపక్ హుడా (1), సంజు శాంసన్ (15), అక్షర్ పటేల్ (1), శార్దూల్ ఠాకూర్ (9) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు తీశాడు. విక్టర్ ఎన్యాచి, ల్యూక్ జాంగ్వే తలో వికెట్ పడగొట్టారు.

 

భారత్ భళా..