India vs West Indies 3rd T20: చెలరేగిన సూర్యకుమార్.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం

మంగళవారం బస్సెటెర్రెలోని వార్నర్ పార్కులో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవటం ద్వారా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

India vs West Indies 3rd T20: చెలరేగిన సూర్యకుమార్.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం

India vs West Indies 3rd T20: మంగళవారం బస్సెటెర్రెలోని వార్నర్ పార్కులో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకోవటం ద్వారా ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 76 పరుగులతో భారత్ జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.

India vs West Indies T20: రెండో టీ20లో టీమిండియా ఓటమి.. మెకాయ్ దాటికి చేతులెత్తేసిన భారత్ బ్యాట్స్‌మెన్

తొలుత టాస్ గెలిచి విండీస్ బ్యాటింగ్‍కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ మేయర్స్ 73( 53 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బ్రాండన్ కింగ్ 20( 20(బంతుల్లో), నికోలస్ పూరన్ 22 (23 బంతుల్లో) రాణించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు బరిలోకి దిగారు. అయితే.. కెప్టెన్ రోహిత్ శర్మ 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెన్నునొప్పి కారణంగా రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు.

India vs West Indies T20: ఈరోజు కూడా ఆలస్యంగానే.. అధికారికంగా వెల్లడించిన విండీస్ క్రికెట్ బోర్డు

ఆ తరువాత బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సూర్య కుమార్ దాటిగా ఆడారు. ఆదినుంచి సూర్యకుమార్ తనదైన శైలిలో బ్యాట్‌కు పనిచెప్పాడు. విండీస్ బౌలర్లు ఎవరూ సూర్యకుమార్ దూకుడుకు అడ్డుకట్ట వేయలేక పోయారు. శ్రేయస్ అయ్యర్ (24 ప‌రుగులు) ఔట్ కాగా, క్రిజ్‌లోకి వచ్చిన రిషబ్ పంత్ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. 135 పరుగుల వద్ద సూర్యకుమార్ (76) అవుట్ కావటంతో హార్ధిక్ పాండ్య క్రిజ్ లోకి వచ్చాడు. కొద్దిసేపటికే హార్ధిక్ పాండ్య (4 ) ఔట్ అయ్యి నిరాశ‌ప‌రిచినా.. దీపిక్ హుడా (10) తో క‌లిసి రిష‌బ్ పంత్ 33 నాటౌట్ కీల‌క ఇన్నింగ్స్ ఆడ‌టంతో భార‌త్ విజ‌యం సాధించింది. మూడవ టీ20లో భారత్ విజయం సాధించడంతో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది.