India vs West Indies T20: రెండో టీ20లో టీమిండియా ఓటమి.. మెకాయ్ దాటికి చేతులెత్తేసిన భారత్ బ్యాట్స్‌మెన్

రెండో టీ20లో వెస్టండీస్ సత్తా చాటింది. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వెస్టండీస్ బౌలర్ మెకాయ్ ధాటికి ఎక్కువ స్కోరు సాధించలేక పోయింది. మెరుపు వేగంతో మెకాయ్ వేసిన బంతులకు భారత్ బ్యాట్స్‌మెన్ నిలవలేక పోయారు.

India vs West Indies T20: రెండో టీ20లో టీమిండియా ఓటమి.. మెకాయ్ దాటికి చేతులెత్తేసిన భారత్ బ్యాట్స్‌మెన్

India vs West Indies T20: రెండో టీ20లో వెస్టండీస్ సత్తా చాటింది. టీమిండియాపై 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వెస్టండీస్ బౌలర్ మెకాయ్ ధాటికి ఎక్కువ స్కోరు సాధించలేక పోయింది. మెరుపు వేగంతో మెకాయ్ వేసిన బంతులకు భారత్ బ్యాట్స్‌మెన్ నిలవలేక పోయారు. దీంతో తక్కువ స్కోర్ కే పెవిలియన్ బాటపట్టారు. దీంతో భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ అయింది. ఒబెడ్ మెకాయ్ ఏకంగా ఆరు వికెట్లు తీసి భారత్ ఓటమిలో కీలక భూమిక పోషించారు.

Virat Kohli: ఆసియాకప్‌పైనే కోహ్లీ ఆశలు.. ఎంపిక చేయకపోవచ్చన్న పాక్ మాజీ క్రికెటర్

ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండో టీ20లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఆదినుంచి భారత్ బ్యాట్స్ మెన్ లను విండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ ముప్పుతిప్పలు పెట్టాడు. మ్యాచ్ తొలి బంతికే రోహిత్ శర్మ(0) పెవిలియన్ బాటపట్టాడు. సూర్యకుమార్ యాదవ్ 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ పది పరుగులు చేశాడు. రిషబ్ పంత్(24), హార్ధిక్ పాండ్యా(31), రవీంద్ర జడేజా(27) ధాటిగా ఆడటంతో స్కోర్ బోర్డు ఆశించిన స్థాయిలో నమోదైంది. దినేశ్ కార్తీక్(7), రవిచంద్ర అశ్విన్ (10), భువనేశ్వర(1), ఆవేష్ ఖాన్(8), అర్షదీప్ సింగ్(1 నాటౌట్)పరుగులు మాత్రమే చేశారు. దీంతో భారత్ 19.4 ఓవర్లకు 138 పరుగులు చేసింది.

India Medals : కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

139 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన విండీస్ బ్యాట్స్ మెన్ ఆచితూచి ఆడారు. విండీస్ ఓపెనర్ బ్రాండన్ కింగ్ (68) పరుగులు చేశాడు. అతనితో పాటు డెవాన్ థామస్ (31 నాటౌట్) రాణించాడు. విండీస్ బ్యాట్స్ మెన్ లలో కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్ (14), షిమ్రాన్ హెల్మెయర్(6), రావ్ మెన్ పావెల్(5), ఒడియన్ స్మిత్ (4 నాటౌట్) పరుగులు చేశారు. చివరి ఓవర్లలో విండీస్ బ్యాట్స్ మెన్ లను పరుగులు చేయకుండా భారత్ బౌలర్లు కట్టడి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఉత్కంఠగా సాగిన పోరులో చివరికి 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి వెస్టిండీస్ 141 పరుగులు చేసింది. దీంతో ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో 1-1 తో ఇరు జట్లు సమంగా నిలిచాయి.