IND vs SL : ఆసియా క‌ప్ విజేత భార‌త్‌.. రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచిన టీమ్ఇండియా

టీమ్ఇండియా (Team India) అద‌ర‌గొట్టింది. కొలంబోని ప్రేమ‌దాస వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన ఆసియా కప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs SL : ఆసియా క‌ప్ విజేత భార‌త్‌.. రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచిన టీమ్ఇండియా

India win the Asia cup 2023

Updated On : September 17, 2023 / 6:30 PM IST

India vs Sri Lanka : టీమ్ఇండియా (Team India) అద‌ర‌గొట్టింది. కొలంబోని ప్రేమ‌దాస వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన ఆసియా కప్ 2023 ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. 51 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 6.1 ఓవ‌ర్ల‌ వికెట్ న‌ష్ట‌పోకుండా ఛేదించింది. ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్ (23), శుభ్‌మ‌న్ గిల్ (27) మిగ‌తా బ్యాట‌ర్ల‌కు ఛాన్స్‌ ఇవ్వ‌కుండా ల‌క్ష్యాన్ని ఛేదించారు. దీంతో భార‌త్ ఎనిమిదో సారి ((1984, 1988, 1991, 1995, 2010, 2016, 2018, 2023) ఆసియా క‌ప్‌ను ముద్దాడింది.

అంత‌క‌ముందు టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. భార‌త బౌల‌ర్ల ధాటికి 15.2 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ (6/21) ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు తీసి లంకకు గ‌ట్టి షాక్ ఇచ్చాడు. ఈ క్ర‌మంలోనే అత‌డు వ‌న్డేల్లో త‌న అత్యుత్త‌మ గ‌ణాంకాల‌ను న‌మోదు చేశాడు. లంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండీస్ (17), దుషన్ హేమంత (13) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్ సాధించ‌గా ఐదుగురు బ్యాట‌ర్లు కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్‌ అసలంక, డాసున్‌ శానక, మతీషా పతిరన లు డ‌కౌట్లు అయ్యారు.

మిగిలిన వారిలో పథుమ్‌ నిశాంక రెండు, ధనుంజయ డిసిల్వా నాలుగు, దునిత్‌ వెల్లలాగే ఎనిమిది, ప్రమోద్‌ మదుషన్ ఒక్క ప‌రుగు చేశారు. భార‌త బౌల‌ర్ల‌లో సిరాజ్ ఆరు వికెట్లతో లంక ప‌త‌నాన్ని శాసించ‌గా హార్దిక్ పాండ్య మూడు, బుమ్రా ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

బంతుల ప‌రంగా వ‌న్డే ఫైన‌ల్ మ్యాచుల్లో అతి పెద్ద విజ‌యాలు

శ్రీలంక పై భార‌త్ (263 బంతులు) ఘ‌న విజ‌యం (ఆసియా క‌ప్ 2023 ఫైన‌ల్‌) కొలంబో
ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా (226 బంతులు) విజ‌యం 2023 సిడ్నీ
పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా (179 బంతులు) గెలుపు 1999 లార్డ్స్

Mohammed Siraj : చ‌రిత్ర సృష్టించిన మ‌హ్మ‌ద్ సిరాజ్‌.. చ‌మిందా వాస్ రికార్డు స‌మం

బంతుల ప‌రంగా వ‌న్డేల్లో భార‌త్ అత్యుత్త‌మ విజ‌యాలు

శ్రీలంక పై 263 బంతులు మిగిలి ఉండ‌గా ఆసియా క‌ప్ 2023 ఫైన‌ల్‌ కొలంబో
కెన్యాపై 263 బంతులు మిగిలి ఉండ‌గా బ్లూమ్‌ఫోంటైన్ 2001
వెస్టిండీస్ పై 211 బంతులు మిగిలి ఉండ‌గా త్రివేండ్రం 2018
ఇంగ్లాండ్ పై 188 బంతులు మిగిలి ఉండ‌గా ఓవ‌ల్ 2022

వన్డే ఫైనల్స్‌లో 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన జ‌ట్లు ఇవే

జింబాబ్వే పై భార‌త్ 1998లో షార్జాలో 197/0
ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 2003లో సిడ్నీలో 118/0
శ్రీలంక‌పై భార‌త్ 2023లో కొలంబోలో 51/0

Pakistan Team: పాక్ జట్టులో బయటపడ్డ విబేధాలు.. బాబర్, షాహీన్ అఫ్రిది మధ్య గొడవ