Suresh Raina Biopic : నా బయోపిక్.. సూర్య చేస్తే బాగుంటుందన్న స్టార్ క్రికెటర్

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తన బయోపిక్‌పై స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రైనా తన బయోపిక్ ఎవరూ చేస్తే బాగుంటుందో రివీల్ చేసేశాడు. ఒకవేళ తన బయోపిక్ తీస్తే మాత్రం.. అందులో ఎవరూ నటించాలని ఉందంటే..

Suresh Raina Biopic : నా బయోపిక్.. సూర్య చేస్తే బాగుంటుందన్న స్టార్ క్రికెటర్

Indian Crickter Suresh Raina Wants To Cast Actor Surya For His Biopic (1)

Indian Crickter Suresh Raina Biopic : భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తన బయోపిక్‌పై స్పందించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రైనా తన బయోపిక్ ఎవరూ చేస్తే బాగుంటుందో రివీల్ చేసేశాడు. ఒకవేళ తన బయోపిక్ తీస్తే మాత్రం.. అందులో ఎవరూ నటించాలని ఉందంటే.. టక్కున హీరో సూర్య అని సమాధానమిచ్చాడు. అతడే తన బయోపిక్ కు బెస్ట్ చాయిస్ అన్నాడు రైనా. ప్రస్తుతం సినీ ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ ట్రెండ్ నడుస్తోంది. సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు సంబంధించి బ‌యోపిక్స్ తెరకెక్కుతున్నాయి.

క్రికేటర్ సురేశ్ రైనా బ‌యోపిక్ అంశం కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో రైనా తన మనస్సులో అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. సూర్యనే ఎందుకంటే.. అతడి నటన చాలా బాగుంటుందని అన్నాడు. ప్రతి సినిమాలో తన రోల్ తగినట్టుగా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంటాడు. పాత్రకు ప్రాణం పోసి.. తన శైలిని మార్చుకుంటాడని రైనా చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు.. తన అభిమాన హీరో ఎవరంటే.. కిచ్చా సుదీప్ అన్నాడు రైనా.. ఆ హీరో సినిమాలే చూస్తానన్నాడు.

ఇటీవల.. పంజాబ్‌లో రైనా కుటుంబంపై సాయుధ దొంగలు దాడి చేశారు.. ఈ దాడిలో తన మామయ్య మృతిచెందారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన రైనాకు సంతాపం తెలియజేసినవారిలో సూర్య కూడా ఉన్నాడు. రాహుల్ ద్రవిడ్‌ సారధ్యంలో వన్డేల్లో రైనా అరంగేట్రం చేశాడు.. టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు చేశాడు.. అలాగే 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్ గా రైనా రికార్డు నెలకొల్పాడు. గతేడాది ఆగస్టు 15న ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అప్పుడు రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు.