T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా, హర్షల్ పటేల్

అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. నలుగు స్టాండ్ బై ప్లేయర్లకు అవకాశం కల్పించింది. అలాగే బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా, హర్షల్ పటేల్

Updated On : September 12, 2022 / 6:15 PM IST

T20 World Cup: వచ్చే అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. సోమవారం సాయంత్రం జట్టు వివరాల్ని వెల్లడించింది. గాయం కారణంగా కొద్ది రోజులు జట్టుకు దూరంగా ఉన్న పేసర్ బుమ్రాతోపాటు, హర్షల్ పటేల్‌కు తిరిగి జట్టులో స్థానం కల్పించింది.

iOS 16 Update: నేటి నుంచే ఐఓఎస్ 16 వెర్షన్.. ఏయే ఫోన్లు అప్‌డేట్ చేసుకోవచ్చో తెలుసా!

ఇటీవలే గాయానికి సర్జరీ చేయించుకున్న ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను బీసీసీఐ ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో యువ ఆల్ రౌండర్ దీపక్ హుడాకు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కింది. స్టాండ్ బై ప్లేయర్లుగా మహమ్మద్ షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్‌ను బీసీసీఐ ఎంపిక చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనబోతుంది. అక్టోబర్ 16న ఈ టోర్నీ ప్రారంభమవుతుంది.

Mobile Torches: కరెంటు లేక మొబైల్ టార్చ్‌తో రోగులకు చికిత్స.. వైరల్‌గా మారిన వీడియో

జట్టు వివరాలివి. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (కీపర్), దినేష్ కార్తీక్ (కీపర్), హార్ధిక్ పాండ్యా, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్.