Shubman Gill First Century : జింబాబ్వేపై చెలరేగిన గిల్, కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు.. మూడేళ్ల నిరీక్షణకు తెర

టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు తన కల నెరవేర్చకున్నాడు. వన్డేల్లో తన తొలి సెంచరీ సాధించాడు.

Shubman Gill First Century : జింబాబ్వేపై చెలరేగిన గిల్, కెరీర్‌లో తొలి సెంచరీ నమోదు.. మూడేళ్ల నిరీక్షణకు తెర

Shubman Gill First Century : టీమిండియా యువ క్రికెటర్ శుభ్ మాన్ గిల్ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు తన కల నెరవేర్చకున్నాడు. వన్డేల్లో తన తొలి సెంచరీ సాధించాడు. జింబాబ్వేతో నామ మాత్రపు మూడో వన్డేలో చెలరేగిన గిల్.. 82 బంతుల్లోనే మెరుపు శతకం బాదేశాడు. తద్వారా తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 97 బంతుల్లో 130 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి స్కోర్ లో 15 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి.

జింబాబ్వేతో మూడో వన్డేలోనూ టీమిండియా జోరు కొనసాగించింది. గిల్ సెంచరీతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 289 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో ధావన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా దిగడంతో, గిల్ వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చాడు. గిల్ ఔటయ్యాక భారత్ స్కోర్ మందగించింది.

అంతకుముందు ధావన్ 40, రాహుల్ 30 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఆ తర్వాత గిల్, ఇషాన్ కిషన్ (50) జోడీ జింబాబ్వే బౌలింగ్ ను ఉతికారేసింది. గిల్, కిషన్ జోడీ విజృంభణతో భారత్ స్కోరు 200 మార్కు దాటింది. దీపక్ హుడా (1), సంజు శాంసన్ (15), అక్షర్ పటేల్ (1), శార్దూల్ ఠాకూర్ (9) నిరాశపరిచారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు తీశాడు. విక్టర్ ఎన్యాచి, ల్యూక్ జాంగ్వే తలో వికెట్ పడగొట్టారు.

గిల్‌ తన తొలి అంతర్జాతీయ సెంచరీ కోసం గత మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. చాలా మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో మెరిసిన గిల్‌ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు.

కొన్ని మ్యాచుల్లో దురదృష్టం వెంటాడింది. విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 98 పరుగులు చేసి సెంచరీకి చేరువైన క్రమంలో వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అతడు తన తొలి సెం‍చరీ నమోదు చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. అయితే ఈసారి మాత్రం గిల్‌ తన కలను నెరవేర్చుకున్నాడు.

గిల్ శతక్కొట్టుడు..

ఇటీవల కాలంలో గిల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన గిల్‌… ఇప్పుడు జింబాబ్వేపై కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో 245 పరుగులు సాధించిన గిల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

2019లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌తో గిల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద 2020 నాటి సిరీస్‌తో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 9 వన్డేలో ఆడిన గిల్‌ 499 రన్స్ చేశాడు.

 

గిల్ మెరుపు సెంచరీ