IPL 2021 CSK Vs SRH చెన్నై టార్గెట్ 135

ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ధోని నమ్మకాన్ని చెన్

IPL 2021 CSK Vs SRH చెన్నై టార్గెట్ 135

Ipl 2021 Csk Vs Srh

IPL 2021 CSK Vs SRH : ఐపీఎల్ 2021 రెండో దశలో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ ధోని నమ్మకాన్ని చెన్నై బౌలర్లు వమ్ము చేయలేదు. చెన్నై బౌలర్లు రాణించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు నామమాత్రపు స్కోరే చేయగలిగింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. చెన్నై ముందు స్పల్ప విజయలక్ష్యం ఉంది.

Pension : పెన్షన్లరకు అలర్ట్.. వెంటనే ఆ సర్టిఫికెట్ సబ్మిట్ చేయండి.. లేదంటే పెన్షన్ రాదు

హైదరాబాద్ ఓపెనర్‌ వృద్ధిమాన్ సాహా (44) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఆరంభంలోనే ఓపెనర్ జేసన్‌ రాయ్‌ (2) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్‌ విలియమ్సన్ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ప్రియం గార్గ్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అభిషేక్‌ శర్మ (18), అబ్దుల్ సమద్‌ (18) నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే హేజిల్‌ వుడ్‌ వేసిన 17వ ఓవర్లో ఇద్దరూ ఔటవ్వడంతో హైదరాబాద్‌ జట్టుకి షాక్‌ తగిలింది. జేసన్‌ హోల్డర్‌ (5) నిరాశ పరిచాడు. చివర్లో బ్యాటింగ్‌ వచ్చిన రషీద్‌ ఖాన్‌ (17), భువనేశ్వర్‌ (2) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్‌ 3, బ్రావో 2 వికెట్లు తీశారు. శార్ధూల్‌ ఠాకూర్‌, జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

Grifthorse : 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ యూజర్లకు ముప్పు.. ఈ యాప్స్ వెంటనే డిలీట్ చేయండి

కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతున్న హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కి దూరమైంది. ఎనిమిది విజయాలతో అగ్రస్థానంలో ఉన్న చెన్నై జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. చెన్నై పాయింట్ల పట్టికలో దూసుకుపోతోంది. ఎనిమిది విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. మరోవైపు ఈ సీజన్‌ ఆరంభం నుంచి పేలవ ప్రదర్శన కనబరుస్తూ చిట్టచివరి స్థానంలో నిలిచింది సన్‌రైజర్స్‌. ఐదు ఓటముల తర్వాత రాజస్థాన్‌పై విజయం సాధించింది ఎస్‌ఆర్‌హెచ్‌.

ధోనీ సారథ్యంలో సీఎస్కే ఈసారి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇదే జోరును మిగతా మ్యాచ్‌లో కొనసాగిస్తే చెన్నై ఈ సారి టైటిల్‌ ఎగరేసుకెపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. టాప్‌ ఆర్డర్‌ ఆటగాళ్లందరూ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌ సూపర్‌ ఫామ్‌లో ఉండగా మొయిన్‌ అలీ, అంబటి రాయుడు తమవంతు సహకారం అందిస్తున్నారు. చివరి ఓవర్లలో రవీంద్ర జడేజా ఆపద్భాంధవుడుగా నిలుస్తున్నాడు.

కెప్టెన్‌ ధోనీ, సురేశ్‌ రైనా అంతగా ప్రభావం చూపించలేకపోతున్నారు. వీరు కూడా ఫామ్‌లోకి వస్తే చెన్నై బ్యాటింగ్‌కి తిరుగుండదు. ఇక బౌలింగ్‌ విభాగంలో చెన్నై పటిష్టంగా కనిపిస్తోంది. దీపక్‌ చాహర్‌, బ్రావో, శార్దూల్‌ ఠాకూర్‌ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ సీఎస్కే విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి అధికారికంగా అడుగుపెట్టాలని ధోనీసేన పట్టుదలగా ఉంది.

ఈ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనతో కొనసాగుతున్న జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. తొలి దశలో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ ఒకే విజయంతో సరిపెట్టుకుంది. రెండోదశలో మెరుగ్గా ఆడుతుందని భావించినా అదే ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌కి ప్లే ఆఫ్స్‌ అవకాశాలు మూసుకుపోయాయి. తొలి దశలో అదరగొట్టిన ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో రెండో దశకు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. డేవిడ్‌ వార్నర్‌ పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతున్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టులో కూడా లేడు.

కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌, మనీశ్‌ పాండే పర్లేదనిపిస్తున్నారు. వృద్ధిమాన్‌ సాహా, కేదార్‌ జాధవ్‌, అబ్దుల్ సమద్‌ నిరాశపరుస్తున్నారు. బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ ఒక్కడే రాణిస్తున్నాడు. భువనేశ్వర్‌, ఖలీల్‌ అహ్మద్‌, జేసర్‌ హోల్డర్ లాంటి ఆటగాళ్లు రాణించాల్సింది.