IPL 2021 MI Vs RR డూ ఆర్ డై మ్యాచ్‌లో తడబడ్డ రాజస్తాన్, ముంబై ముందు ఈజీ టార్గెట్

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్తాన్ బ్యాట్స్ మె

IPL 2021 MI Vs RR డూ ఆర్ డై మ్యాచ్‌లో తడబడ్డ రాజస్తాన్, ముంబై ముందు ఈజీ టార్గెట్

Rajasthan Royals

IPL 2021 MI Vs RR : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. డూ ఆర్ డై మ్యాచ్ లో ముంబై బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రాజస్తాన్ బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. రాజస్తాన్ జట్టు 100 పరుగుల కూడా చేయలేక చతికిల పడింది.

Ticket Prices : వైజాగ్ టు హైదరాబాద్ రూ.3వేలు.. టికెట్ల ధరలు భారీగా పెంపు

నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేసింది. రాజస్తాన్ జట్టులో ఓపెనర్ లెవిస్(24) టాప్ స్కోరర్. మిగతా వారంతా విఫలం అయ్యారు. మిల్లర్(15), రాహుల్ తెవాటియా(12) పర్లేదనిపించారు. కెప్టెన్ సంజూ శాంసన్(3), శివమ్ దూబే(3) నిరాశపరిచారు. మంబయి బౌలర్లలో నైల్, నీషమ్ నిప్పులు చెరిగారు. కౌల్టర్ నైల్ 4 వికెట్లు తీయగా, జేమ్స్ నీషమ్ 3, బుమ్రా 2 వికెట్లు తీశాడు.

Jimmy Neesham

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ సెకండాఫ్ లో ముంబయి, రాజస్థాన్‌ జట్లు ఇంచుమించు ఒకేలా ఆడుతున్నాయి. రాజస్థాన్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, రెండు విజయాలతో కొనసాగుతుండగా.. ముంబయి నాలుగు ఓటములు ఒక విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులో కొట్టుమిట్టాడుతోంది. అయితే, గత మ్యాచ్‌లో రాజస్థాన్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించడమే ఇప్పుడు ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశంగా ఉంది. మరోవైపు ముంబయి గతవారం పంజాబ్‌ను ఓడించి గెలుపు బాటపట్టినా.. శనివారం ఢిల్లీతో మ్యాచ్ లో ఓటమిపాలైంది.

Shivam Dube

ముంబయి గెలవాలంటే..
ఈ సీజన్‌లో ముంబయి వైఫల్యానికి ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్‌ సరిగ్గా ఆడకపోవడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌ మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ నుంచి లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో కీరన్‌ పొలార్డ్‌ వరకు ప్రతి ఒక్కరు బ్యాట్లకు పనిచెప్పలేక చతికిలపడ్డారు. అయితే, ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య కాస్త ఫామ్ ను అందుకున్నట్లు కనిపించారు. మధ్యలో వారిద్దరు పరుగులు చేయడంతో ముంబయి 129 పరుగుల సాధారణ స్కోరైనా సాధించింది. మరోవైపు బౌలింగ్‌లో పేసర్లు బుమ్రా, కౌల్టర్‌ నైల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ లాంటి ఆటగాళ్లు ఫర్వాలేదనిపిస్తున్నా కీలక స్పిన్నర్లుగా కొనసాగుతున్న కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌ వికెట్లు తీయలేక ఇబ్బందులు పడుతున్నారు. వీళ్లంతా జట్టుగా రాణిస్తే తప్ప ముంబయి నేటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించే పరిస్థితి లేదు.

CM KCR : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 80వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ..!

రాజస్థాన్‌ నిలవాలంటే..
ఇక రాజస్థాన్‌ జట్టులో ప్రస్తుతం బ్యాట్స్‌మెన్‌ అంతా ఫామ్‌లో ఉన్నారు. చెన్నైతో తలపడిన గత మ్యాచ్‌లో ఆ జట్టు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌, యశస్వి జైశ్వాల్‌ పూర్తి సానుకూల దృక్పథంతో కనిపిస్తున్నారు. వీరిద్దరూ చెన్నైతో మ్యాచ్‌లో ఐదు ఓవర్లలోనే 75 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశారు. ఆపై కెప్టెన్‌ సంజూ శాంసన్‌, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె ధాటిగా ఆడుతున్నారు. ఇక బౌలింగ్‌లో రాహుల్‌ తెవాతియా, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే ముంబయిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా రాజస్థాన్‌ 12, ముంబయి 13 మ్యాచ్‌లు గెలుపొందాయి.