BCCI Meeting: ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారా? నేడే కీలక నిర్ణయం!

ఐపీఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహిస్తారా? మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకనుంది ఈరోజు(29 మే 2021). క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందుతుందా? సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగుతాయా? టీ20 ప్రపంచకప్ పరిస్థితి ఏంటీ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు బీసీసీఐ సమావేశం కానుంది.

BCCI Meeting: ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తారా? నేడే కీలక నిర్ణయం!

Ipl

IPL 2021: ఐపీఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను నిర్వహిస్తారా? మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకనుంది ఈరోజు(29 మే 2021). క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ అందుతుందా? సెప్టెంబర్‌ 19 నుంచి దుబాయ్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరిగుతాయా? టీ20 ప్రపంచకప్ పరిస్థితి ఏంటీ? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు బీసీసీఐ సమావేశం కానుంది.

జూన్ 1 న ఐసిసి బోర్డు సమావేశం కూడా ఉంటుంది. అంతకుముందే, ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు భారతదేశంలో కోవిడ్ -19 స్థితిపై సమీక్ష కోసం బిసిసిఐని ఈ ప్రపంచ క్రీడా సంస్థ అడుగుతుంది. టీ20 ప్రపంచ కప్‌ను నిర్ణయించే ముందు ఐసిసి బీసీసీఐ నిర్ణయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను భారతదేశంలో నిర్వహించే అవకాశం ఉండగా.. దీనిపై కూడా బీసీసీఐ చర్చించనుంది. మధ్యాహ్నం 12గంటలకు బీసీసీఐ సమావేశం జరగనుంది.

ఇదే విషయమై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శుక్రవారమే ముంబై చేరుకున్నారు. గంగూలీనే ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఐపిఎల్ 2021 షెడ్యూల్ ప్రధాన ఎజెండా కాగా.. ఫైనల్(రెండు క్వాలిఫైయర్స్, ఒక ఎలిమినేటర్) మరియు 10 డబుల్-హెడర్స్ (రెండు మ్యాచ్‌లు) సహా మాకు నాలుగు ప్లే-ఆఫ్ మ్యాచ్‌లు ఉన్నాయి.” అని చెప్పారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021లో ఇప్పటికే 29 మ్యాచ్‌లు జరగ్గా 31 మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన ఐపీఎల్‌ మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. సెప్టెంబర్‌ మూడో వారంలో యూఏఈలో మ్యాచ్‌లను తిరిగి కొనసాగించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకూ యూఏఈ వేదికగా మిగిలిన సీజన్‌ను పూర్తి చేయనున్నట్లు సమాచారం.

దీని కోసం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ను ముందుగా పూర్తి చేయాలని బీసీసీఐ.. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును రిక్వెస్ట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మూడో టెస్టుకు, నాలుగో టెస్టుకు మధ్య ఉన్న 9రోజుల గ్యాప్ కుదిస్తే ఇది సాధ్యపడుతుందని చెప్పుకొచ్చింది. అలా చేయడం వల్ల 30రోజుల టైం పీరియడ్ దొరుకుతుంది. ఆ సమయంలో టోర్నమెంట్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేసేయొచ్చు. దానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోతే మాత్రం నాకౌట్ మ్యాచ్‌లు తర్వాత నిర్వహించాలి.

యూఏఈలో కుదరకపోతే యూకేలో!
ఐపీఎల్‌ను యూఏఈలో కాకుంటే యూకేలోనైనా నిర్వహించాలని చూస్తున్నారు. అయితే గతేడాది ఐపీఎల్ యూఏఈలో నిర్వహించింది కాబట్టి మళ్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కే బీసీసీఐ మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆరు విజయాలతో అగ్రస్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్, ఐదు విజయాలతో రెండో స్థానంలో చెన్నై ఉన్నాయి. బెంగళూరు ఐదు విజయాలతో మూడో స్థానంలో.. ముంబయి ఇండియన్స్‌ నాలుగు విజయాలతో నాలుగో స్థానంలో ఉంది.