IPL 2021 RR Vs KKR రాజస్తాన్ టార్గెట్ 172

ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా

IPL 2021 RR Vs KKR రాజస్తాన్ టార్గెట్ 172

Rajasthan Royals Vs Kolkata Knight Riders

IPL 2021 RR Vs KKR : ఐపీఎల్ 2021 సెకండాఫ్ లో భాగంగా రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.

కోల్ కతా ఓపెనర్ శుభ్ మన్ గిల్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 44 బంతుల్లో 56 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ 35 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. వీరి జోడీ శుభారంభం ఇచ్చింది. రాజస్తాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్, చేతన్ సకారియా, రాహుల్ తెవాటియా, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ తీశారు. ఇరుజట్లకు ఇది ఎంతో కీలక మ్యాచ్. ఈ మ్యాచ్ లో గెలుపుతో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా నిలుపుకోవాలని కోల్ కతా, రాజస్తాన్ భావిస్తున్నాయి.

Mukesh Ambani : ఇండియాకు 7-ఎలెవెన్ స్టోర్లు.. దేశంలో ఫస్ట్ స్టోర్ ఎక్కడంటే?

ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ రేస్‌ ఆసక్తికరంగా మారింది. మూడు జట్లు ఇప్పటికే తమ స్థానాలను పదిలం చేసుకోగా మిగిలిన నాలుగో స్థానం కోసమే మిగతా జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో 12 పాయింట్లతో ఉన్న కోల్‌కతా జట్టుకే మెరుగైన అవకాశాలు ఉన్నాయి. రాజస్తాన్ తో మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది.

రన్‌రేట్‌ పరంగా ముంబయి కన్నా మెరుగ్గా ఉండటమే అందుకు కారణం. ఒకవేళ రాజస్తాన్ గెలిస్తే అప్పుడు మోర్గాన్‌ టీమ్‌.. ముంబయి, సన్‌రైజర్స్‌ ఫలితంపై ఆధారపడాలి. రాజస్తాన్ గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సంజూ టీమ్‌ ప్లేఆఫ్స్‌ చేరాలంటే కోల్‌కతాను 125 పరుగుల భారీ తేడాతో ఓడించడమే కాకుండా ముంబయిపై సన్‌రైజర్స్‌ టీమ్‌ 40 పరుగులతో గెలవాలి. ఇది అసంభవవమనే చెప్పొచ్చు.

Facebook: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

యూఏఈలో జరుగుతున్న సెకాండాఫ్ లో కోల్‌కతా ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు విజయాలు సాధించింది. రాజస్తాన్ దీనికి పూర్తి భిన్నంగా రెండు మ్యాచ్‌లే గెలిచి నాలుగు ఓటములు చవిచూసింది. దీంతో మోర్గాన్‌ జట్టే బలంగా ఉంది. గత మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ను కోల్ కతా ఓడించింది. రాజస్తాన్ చివరి మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఘోరంగా విఫలమైంది. ఎలా చూసినా కోల్‌కతానే ఫేవరెట్‌గా ఉంది.