IPL 2023, Hyderabad Match: మ్యాచ్ మధ్యలో లోపలికి రావద్దు.. చీర్ గర్ల్స్ ను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు: రాచకొండ పోలీస్ కమిషనర్

రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ మీడియా సమావేశంలో నిర్వహించి మ్యాచ్ అన్ని ఏర్పాట్లపై పూర్తి వివరాలు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించామన్నారు.

IPL 2023, Hyderabad Match: మ్యాచ్ మధ్యలో లోపలికి రావద్దు.. చీర్ గర్ల్స్ ను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు: రాచకొండ పోలీస్ కమిషనర్

IPL 2023

IPL 2023, Hyderabad Match: హైదరాబాద్, ఉప్పల్‌ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సర్వం సిద్ధమైంది. ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ Vs రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. మ్యాచ్ ఏర్పాట్లపై రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు తెలిపారు.

ఐపీఏల్ మ్యాచ్ కి 1,500 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడే ఇరు జట్ల సభ్యులతో కూడా మాట్లాడామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అందరి సమన్వయంతో క్రికెట్ మ్యాచ్ ను విజయవంతం చేయాలని అన్నారు. ట్రాఫిక్ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. ఆన్ లైన్లో టికెట్స్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. బ్లాక్ లో టికెట్స్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిసిటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. మ్యాచ్ మధ్యలో ఎవ్వరు స్టేడియం లోపలికి రావొద్దని తెలిపారు.

అలా వస్తే కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ సారి నూతన టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నామని తెలిపారు. చీర్ గర్ల్స్ వ్యవహారంలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెట్రో రైలు టైమింగ్ చేంజ్ చేశామని తెలిపారు. స్టేడియంకు వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు.

రేపు ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని అభిషేక్ మహంతి చెప్పారు. స్టేడియం నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలు అనుమతిస్తామని తెలిపారు. భారీ వాహనాలు ఉప్పల్ స్టేడియం వైపు అనుమతి లేదని చెప్పారు. వాహనదారులకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు.

సరికొత్త టీమ్..

సరికొత్త టీమ్ తో ఈ సీజన్ లో అడుగుపెడుతున్నామని సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు భువనేశ్వర్ కుమార్ చెప్పాడు. తమ బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉందని అన్నాడు. కెప్టెన్ ల విషయంలో ప్రతీ సీజన్ లో కొంత తడబాటు ఉండేదని, ఈసారి మార్క్రమ్ కెప్టెన్సీ తో తమ జట్టుకి అదనపు బలం వచ్చిందని తెలిపాడు. యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ తమ బౌలింగ్ అదనపు బలమని చెప్పాడు.

IPL 2023: జియో సినిమా యాప్‌ సరికొత్త రికార్డు.. ఒక్క రోజులోనే కోట్లాది డౌన్‌లోడ్‌లు

హైదరాబాద్​లో ఎప్పుడు?.. ఏ జట్టుతో?

ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ Vs రాజస్థాన్
ఏప్రిల్ 9న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs పంజాబ్
ఏప్రిల్ 18న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs ముంబై
ఏప్రిల్ 24న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs ఢిల్లీ
మే 4న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs కోల్‌కతా
మే 13న మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ Vs లఖ్​నవూ
మే 18న రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్ Vs బెంగళూరు