IPL 2023, KKR Vs GT: కోల్‌క‌తాపై గుజ‌రాత్ విజ‌యం

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)లో భాగంగా ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders ), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IPL 2023, KKR Vs GT: కోల్‌క‌తాపై గుజ‌రాత్ విజ‌యం

KKR Vs GT

IPL 2023, KKR Vs GT: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో భాగంగా కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 29 Apr 2023 07:48 PM (IST)

    గుజ‌రాత్ విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో భాగంగా కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్దేశించిన ల‌క్ష్యాన్ని గుజ‌రాత్ 17.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 29 Apr 2023 07:41 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో 24 ప‌రుగులు

    17వ ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేశాడు. ఈ ఓవ‌ర్‌లో విజ‌య్ శంక‌ర్ మూడు సిక్స్‌లు ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 24 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 168/3. డేవిడ్ మిల్ల‌ర్‌(30), విజ‌య్ శంక‌ర్‌(30)లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:37 PM (IST)

    విజ‌య్ శంక‌ర్ సిక్స్‌

    16వ ఓవ‌ర్‌ను ర‌స్సెల్ వేయ‌గా నాలుగో బంతికి విజ‌య్ శంక‌ర్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 142/3. డేవిడ్ మిల్ల‌ర్‌(29), విజ‌య్ శంక‌ర్‌(21)లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:31 PM (IST)

    రెండు సిక్స్‌లు, ఓ ఫోర్

    15వ ఓవ‌ర్‌ను సుయాష్ శర్మ వేశాడు. మిల్ల‌ర్ వ‌రుస‌గా రెండు సిక్స‌ర్లు కొట్ట‌గా విజ‌య శంక‌ర్ ఓ ఫోర్ బాద‌డంతో ఈ ఓవ‌ర్‌లో 18 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 129/3. డేవిడ్ మిల్ల‌ర్‌(26), విజ‌య్ శంక‌ర్‌(12)లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:24 PM (IST)

    మిల్ల‌ర్ ఫోర్‌

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేసిన 14వ ఓవ‌ర్‌లో డేవిడ్ మిల్ల‌ర్ ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తం 9 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 111/3. డేవిడ్ మిల్ల‌ర్‌(13), విజ‌య్ శంక‌ర్‌(7)లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:19 PM (IST)

    4 ప‌రుగులు

    సుయాష్ శర్మ క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో ప‌ద‌మూడో ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 102/3. డేవిడ్ మిల్ల‌ర్‌(6), విజ‌య్ శంక‌ర్‌(5)లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:14 PM (IST)

    గిల్ ఔట్‌

    అర్ధ‌శ‌త‌కానికి ప‌రుగు దూరంలో గిల్ ఔట్ అయ్యాడు. సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో ర‌స్సెల్ క్యాచ్ అందుకోవ‌డంతో గుజ‌రాత్ 93 ప‌రుగుల వ‌ద్ద‌(11.2వ ఓవ‌ర్‌)మూడో వికెట్‌ను కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 98/3. డేవిడ్ మిల్ల‌ర్‌(5), విజ‌య్ శంక‌ర్‌(2)లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 07:10 PM (IST)

    హార్ధిక్ పాండ్యా ఔట్‌

    హర్షిత్ రాణా బౌలింగ్‌లో హార్ధిక్ పాండ్యా ఎల్భీగా పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 91 ప‌రుగుల(10.4) వ‌ద్ద గుజ‌రాత్ రెండో వికెట్‌ను కోల్పోయింది.

  • 29 Apr 2023 07:03 PM (IST)

    హార్ధిక్ పాండ్యా సిక్స్‌

    సునీల్ న‌రైన్ ప‌దో ఓవ‌ర్ వేశాడు. మూడో బంతికి హార్ధిక్ పాండ్యా సిక్స్ బాదాడు.దీంతో ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 89/1. హార్దిక్ పాండ్యా(25), శుభ్‌మ‌న్ గిల్ (48) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:59 PM (IST)

    హార్ధిక్ పాండ్యా ఫోర్‌

    సుయాష్ శర్మ తొమ్మిదో ఓవ‌ర్‌ను వేయ‌గా మూడో బంతికి హార్ధిక్ పాండ్యా ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 78/1. హార్దిక్ పాండ్యా(16), శుభ్‌మ‌న్ గిల్ (46) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:54 PM (IST)

    7 ప‌రుగులు

    ఎనిమిదో ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగుల‌కే వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 70/1. హార్దిక్ పాండ్యా(10), శుభ్‌మ‌న్ గిల్ (44) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:49 PM (IST)

    గిల్ ఫోర్‌

    ఏడో ఓవ‌ర్‌ను సుయాశ్‌ శర్మ వేశాడు. ఐదో బంతికి గిల్ ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 63/1. హార్దిక్ పాండ్యా(6), శుభ్‌మ‌న్ గిల్ (41) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:46 PM (IST)

    5 ప‌రుగులు

    గుజ‌రాత్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేశాడు. ఈ ఓవ‌ర్‌లో గిల్ ఫోర్ కొట్ట‌డంతో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 52/1. హార్దిక్ పాండ్యా(5), శుభ్‌మ‌న్ గిల్ (35) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:38 PM (IST)

    సాహా ఔట్‌

    ర‌స్సెల్ బౌలింగ్‌లో హర్షిత్ రాణా క్యాచ్ అందుకోవ‌డంతో సాహా(10) ఔట్ అయ్యాడు. దీంతో 41 ప‌రుగుల(4.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద గుజ‌రాత్ తొలి వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 47/1. హార్దిక్ పాండ్యా(5), శుభ్‌మ‌న్ గిల్ (30) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:35 PM (IST)

    సాహా ఫోర్‌

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి నాలుగో ఓవ‌ర్‌ను వేశాడు. తొలి బంతికి సాహా ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 41/0. వృద్దిమాన్ సాహా(10), శుభ్‌మ‌న్ గిల్ (29) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:31 PM (IST)

    గిల్ మూడు ఫోర్లు

    హర్షిత్ రాణా వేసిన మూడో ఓవ‌ర్‌లో గిల్ మూడు ఫోర్లు కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 19 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 32/0. వృద్దిమాన్ సాహా(4), శుభ్‌మ‌న్ గిల్ (27) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:29 PM (IST)

    గిల్ దూకుడు

    ల‌క్ష్య ఛేద‌న‌కు గుజ‌రాత్ జ‌ట్టు బ‌రిలోకి దిగింది. వృద్దిమాన్ సాహా, శుభ్‌మ‌న్ గిల్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్ వేసిన హర్షిత్ రాణా కేవ‌లం మూడు ప‌రుగులే ఇచ్చాడు. ఆండ్రీ ర‌స్సెల్ వేసిన రెండో ఓవ‌ర్‌లో గిల్ రెండు ఫోర్లు కొట్టాడు. 2 ఓవ‌ర్ల‌కు గుజ‌రాత్ స్కోరు 13/0. వృద్దిమాన్ సాహా(3), శుభ్‌మ‌న్ గిల్ (10) లు క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 06:02 PM (IST)

    గుజ‌రాత్ ల‌క్ష్యం 180

    టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో రహమనుల్లా గుర్బాజ్( 81; 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా ఆఖ‌ర్లో ఆండ్రీ ర‌స్సెల్‌(34; 19 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) దంచికొట్టాడు. గుజరాత్ బౌల‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ మూడు వికెట్లు తీయ‌గా జాషువా లిటిల్, నూర్ అహ్మద్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

  • 29 Apr 2023 05:56 PM (IST)

    డేవిడ్ వైస్ సిక్స్

    19వ ఓవ‌ర్‌ను జాషువా లిటిల్ వేశాడు. ఆఖ‌రి బంతికి డేవిడ్ వైస్ సిక్స్ కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 19 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 167/6. ఆండ్రీ రస్సెల్(23),డేవిడ్ వైస్(7) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 05:49 PM (IST)

    రింకూ సింగ్ ఔట్‌

    నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన రింకూ సింగ్(19) బౌండ‌రీ లైన్ వ‌ద్ద జాషువా లిటిల్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 156 ప‌రుగుల(17.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా ఆరో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 156/6. ఆండ్రీ రస్సెల్(19),డేవిడ్ వైస్(0) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:46 PM (IST)

    రెండు సిక్స్‌లు కొట్టిన ర‌స్సెల్

    17వ ఓవ‌ర్‌ను ర‌షీద్‌ఖాన్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని రెండు, ఐదో బంతుల‌ను ర‌స్సెల్ సిక్స‌ర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 151/5. ఆండ్రీ రస్సెల్(14), రింకూసింగ్‌(19) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:39 PM (IST)

    గుర్బాజ్ ఔట్‌

    ధాటిగా ఆడుతున్న‌ రహమనుల్లా గుర్బాజ్(81) పెవిలియ‌న్ చేరుకున్నాడు. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో ర‌షీద్ ఖాన్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 135 ప‌రుగుల(15.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా ఐదో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 137/5. ఆండ్రీ రస్సెల్(1), రింకూసింగ్‌(18) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:36 PM (IST)

    గుర్బాజ్ సిక్స్‌, ఫోర్‌

    15 ఓవ‌ర్‌ను ర‌షీద్ ఖాన్ వేశాడు. నాలుగో బంతికి సిక్స్ కొట్టిన గుర్బాజ్ ఐదో బంతికి ఫోర్ బాదాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 15 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 134/4. రహమనుల్లా గుర్బాజ్(81), రింకూసింగ్‌(16) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:31 PM (IST)

    రింకూ సింగ్ సిక్స్‌

    మోహిత్ శ‌ర్మ 14వ ఓవ‌ర్‌ను వేశాడు. తొలి బంతికి రింకూ సింగ్ సిక్స్ కొట్టాడంతో ఈ ఓవ‌ర్‌లో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 117/4. రహమనుల్లా గుర్బాజ్(68), రింకూసింగ్‌(13) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:25 PM (IST)

    8 ప‌రుగులు

    ఓ పక్క వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి గుర్భాజ్ దూకుడు కొన‌సాగిస్తున్నాడు. హార్ధిక్ పాండ్యా వేసిన 13వ ఓవ‌ర్‌లోని మొద‌టి బంతికి సిక్స్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 105/4. రహమనుల్లా గుర్బాజ్(67), రింకూసింగ్‌(2) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:20 PM (IST)

    గుర్భాజ్ సిక్స్‌

    నూర్ అహ్మ‌ద్ వేసిన ప‌న్నెండో ఓవ‌ర్‌లోని తొలి బంతికి రహమనుల్లా గుర్బాజ్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 97/4. రహమనుల్లా గుర్బాజ్(60), రింకూసింగ్‌(1) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:17 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు

    జాషువా లిటిల్ కోల్‌క‌తాను గ‌ట్టి దెబ్బ కొట్టాడు. ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. తొలి బంతికి ఎల్బీగా వెంక‌టేశ్ అయ్య‌ర్(11) ఔట్ కాగా నాలుగో బంతికి కెప్టెన్ నితీశ్ రాణా(4) రాహుల్ తెవాటియా క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 88 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా నాలుగో వికెట్ కోల్పోయింది. 11 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 88/4. రహమనుల్లా గుర్బాజ్(52), రింకూసింగ్‌(0) క్రీజులో ఉన్నాడు

  • 29 Apr 2023 05:11 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. జాషువా లిటిల్ బౌలింగ్‌లో వెంక‌టేశ్ అయ్య‌ర్(11) ఎల్బీగా పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 84 ప‌రుగుల(10.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా మూడో వికెట్ కోల్పోయింది.

  • 29 Apr 2023 05:08 PM (IST)

    4 ప‌రుగులు

    ప‌దో ఓవ‌ర్‌ను నూర్ అహ్మ‌ద్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో కేవ‌లం 4 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 84/2. రహమనుల్లా గుర్బాజ్(52), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(11) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 05:02 PM (IST)

    రహమనుల్లా గుర్బాజ్ అర్ధ‌శ‌త‌కం

    జాషువా లిటిల్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి రెండు ప‌రుగులు తీసి 27 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల‌తో రహమనుల్లా గుర్బాజ్ అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 80/2. రహమనుల్లా గుర్బాజ్(51), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(9) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 04:56 PM (IST)

    గుర్బాజ్ ఫోర్

    ర‌షీద్ ఖాన్‌ వేసిన ఎనిమిద ఓవ‌ర్‌లోని రెండో బంతికి రహమనుల్లా గుర్బాజ్ ఫోర్ బాదాడు,. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 75/2. రహమనుల్లా గుర్బాజ్(48), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(7) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 04:52 PM (IST)

    5 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను జాషువా లిటిల్ వేశాడు. నాలుగో బంతికి రహమనుల్లా గుర్బాజ్ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 66/2. రహమనుల్లా గుర్బాజ్(43), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(3) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 04:47 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    కోల్‌క‌తా ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను ర‌షీద్ ఖాన్ వేయ‌గా రహమనుల్లా గుర్బాజ్ దూకుడు కొన‌సాగించాడు. మూడో బంతికి సిక్స్‌, నాలుగో బంతికి ఫోర్ బాదాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తంగా 14 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 61/2. రహమనుల్లా గుర్బాజ్(39), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(2) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 04:44 PM (IST)

    శార్దూల్ ఠాకూర్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌హ్మ‌ద్ ష‌మీ వేసిన ఐదో ఓవ‌ర్‌లోని మొద‌టి రెండు బంతుల‌ను గుర్బాజ్ వ‌రుస‌గా 4,6 గా మ‌లిచాడు. ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి శార్దూల్ ఠాకూర్(0) ఔట్ అయ్యాడు. దీంతో 47 ప‌రుగుల వ‌ద్ద కోల్‌క‌తా రెండో వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 47/2. రహమనుల్లా గుర్బాజ్(27) క్రీజులో ఉన్నాడు.

  • 29 Apr 2023 04:37 PM (IST)

    గుర్బాజ్ రెండు సిక్స్‌లు

    హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవ‌ర్‌లోని రెండు, నాలుగో బంతిని గుర్బాజ్ సిక్స్‌లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 36/1. రహమనుల్లా గుర్బాజ్(16), శార్దూల్ ఠాకూర్(0) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 04:33 PM (IST)

    జ‌గ‌దీశ‌న్ ఔట్‌

    కోల్‌క‌తాకు షాక్ త‌గిలింది. దూకుడుగా ఆడుతున్నజ‌గ‌దీశ‌న్‌.. మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. దీంతో 23 ప‌రుగుల(2.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 23/1. రహమనుల్లా గుర్బాజ్(3), శార్దూల్ ఠాకూర్(0) క్రీజులో ఉన్నారు.

  • 29 Apr 2023 04:29 PM (IST)

    జ‌గ‌దీశ‌న్ మూడు ఫోర్లు

    టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది కోల్‌క‌తా. జ‌గ‌దీశ‌న్‌, రహ్మానుల్లా గుర్బాజ్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. ష‌మీ వేసిన మొద‌టి ఓవ‌ర్‌లో మూడు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. హార్ధిక్ పాండ్యా వేసిన రెండో ఓవ‌ర్‌లో జ‌గ‌దీశ‌న్ మూడు ఫోర్లు కొట్టాడు. 2 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 16/0

  • 29 Apr 2023 03:34 PM (IST)

    నితీశ్ రాణా జట్టు

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు: జగదీశన్, రహమనుల్లా గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత్ రాణా, వరుణ్

  • 29 Apr 2023 03:33 PM (IST)

    హార్దిక్ పాండ్యా సేన

    గుజరాత్ టైటాన్స్ తుది జట్టు: వృద్ధిమాన్ సాహా, అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్