IPL 2023, PBKS vs KKR: వర్షం అడ్డంకి.. D/L methodతో ఫలితం.. 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయ దుందుభి
కోల్కతా నైట్ రైడర్స్ 192 పరుగుల లక్ష్యఛేదనలో తడబడింది. దానికి తోడు చివరి నాలుగు ఓవర్లలో వర్షం పడింది. దీంతో D/L methodతో ఫలితం తేల్చారు.

IPL 2023
IPL 2023, PBKS vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023)లో రెండో మ్యాచ్ పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ (PBKS vs KKR) మధ్య జరిగింది. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా మొదట బౌలింగ్ ఎంచుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ ముందు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కోల్కతా 16 ఓవర్లలో 146/7 పరుగులు చేసింది. అనంతరం వర్షం పడింది. దీంతో D/L methodతో ఫలితాన్ని ప్రకటించారు. 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది.
LIVE NEWS & UPDATES
-
7 పరుగుల తేడాతో పంజాబ్ విజయం
మ్యాచ్ కు చివరి నాలుగు ఓవర్లలో వర్షం అడ్డంకి తగలడంతో D/L methodతో ఫలితం తేల్చారు. 7 పరుగుల తేడాతో పంజాబ్ విజయ దుందుభి మోగించింది.
-
వర్షం అడ్డంకి
మ్యాచ్ కి వర్షం అడ్డు తగిలింది. కేకేఆర్ స్కోరు 146/7 (16 ఓవర్లకి)గా ఉంది. కేకేఆర్ 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. వర్షం వెలిస్తే బ్యాటింగ్ ఆడుతుంది.
-
ఏడో వికెట్ కోల్పోయిన కోల్కతా
కోల్కతా నైట్ రైడర్స్ ఏడో వికెట్ కోల్పోయింది. రస్సెల్ ధాటిగా ఆడి 35 పరుగులు చేసి సామ్ కుర్రన్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ జట్టు స్కోరు 138/7 (15.3/20)గా ఉంది.
-
5వ వికెట్ డౌన్
కోల్కతా నైట్ రైడర్స్ 5 వికెట్లు కోల్పోయింది. నితీశ్ రాణా 24, రింకు సింగ్ 4 పరుగులకు ఔటయ్యారు. కోల్కతా నైట్ రైడర్స్ స్కోరు 11 ఓవర్లకు 85/5గా ఉంది.
-
మూడో వికెట్ డౌన్
కోల్కతా నైట్ రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసి అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్ అయ్యాడు.
-
2 వికెట్లు డౌన్
కోల్కతా నైట్ రైడర్స్ 2 వికెట్లు కోల్పోయింది. అనుకుల్ రాయ్ 4 పరుగులు చేసి అర్ష్ దీప్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. కోల్కతా నైట్ రైడర్స్ స్కోరు 17/2 (2 ఓవర్లకు)గా ఉంది.
-
తొలి వికెట్
కోల్కతా నైట్ రైడర్స్ 1.1 ఓవర్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో మన్ దీప్ సింగ్ 2 పరుగులకే ఔటయ్యాడు.
-
ఓపెనర్లుగా క్రీజులోకి మన్ దీప్ సింగ్, గుర్బాజ్
కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లుగా క్రీజులోకి మన్ దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్ వచ్చారు. ముందుగా వెలుతురు సరిగా లేకపోవడంతో.. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
-
కోల్కతా ఇన్నింగ్స్ ఆలస్యం
వెలుతురు తక్కువగా ఉండడంతో రెండో ఇన్నింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్లుగా క్రీజులోకి మన్ దీప్ సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్ వచ్చే అవకాశం ఉంది.
-
కోల్కతా నైట్ రైడర్స్ లక్ష్యం 192
కోల్కతా నైట్ రైడర్స్ ముందు పంజాబ్ కింగ్స్ జట్టు 192 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో రాజపక్సే 50, శిఖర్ ధావన్ 40 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఆ జట్టు 191 పరుగులు చేసింది. కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లలో సౌథీ 2, ఉమేశ్ యాదవ్, సునీల్, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
-
5వ వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ 5వ వికెట్ కోల్పోయింది. సికందర్ రజా 16 పరుగులు చేసి ఔటయ్యాడు. పంజాబ్ స్కోరు 18 ఓవర్లకు 169/5 గా ఉంది.
-
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ 40 పరుగులు చేసి ఔటయ్యాడు. ధావన్ ను బౌలర్ వరుణ్ చక్రవర్తి క్లీన్ బోల్డ్ చేశాడు.
-
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ ఔట్
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జితేశ్ శర్మ ఔటయ్యాడు. 10 బంతుల్లో 21 పరుగులు చేసి, టిమ్ సౌథీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. పంజాబ్ స్కోరు 135/3 (13.3 ఓవర్లు)గా ఉంది.
-
హాఫ్ సెంచరీ బాది రాజపక్సే ఔట్
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ భానుకా రాజపక్సే 30 బంతుల్లో 2 సిక్సులు 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ బాదాక, ఆ వెంటనే ఔటయ్యాడు. క్రీజులో ధావన్ (36 పరుగులు), జితేశ్ శర్మ (3) ఉన్నారు.
-
రాజపక్సే హాఫ్ సెంచరీ
పంజాబ్ కింగ్స్ బ్యాటర్ భానుకా రాజపక్సే అదరగొట్టేశాడు. 30 బంతుల్లో 2 సిక్సులు 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ బాదాడు. ధావన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. 23 బంతుల్లో 34 పరుగులు చేశాడు. పంజాబ్ స్కోరు 109/2 (11 ఓవర్లకు)గా ఉంది.
-
5 ఓవర్లకు 50/1
పంజాబ్ కింగ్స్ స్కోరు 5 ఓవర్లకు 50/1గా ఉంది. శిఖర్ ధావన్ 10, రాజపక్సే 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.
-
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. సౌథీ బౌలింగ్ లో ప్రభ్సిమ్రాన్ సింగ్ ఔటయ్యాడు. పంజాబ్ స్కోరు 3 ఓవర్లకు 24/1గా ఉంది.
-
పంజాబ్ బ్యాటింగ్ షురూ
పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్(కెప్టెన్) వచ్చారు.
-
రాణా సేన
కోల్కతా నైట్ రైడర్స్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, మన్ దీప్ సింగ్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చకరవర్తి
-
ధావన్ సేన
పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్), ప్రభ్ సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్సే, జితేశ్ శర్మ, ఖాన్, సామ్ కర్రాన్, సికందర్ రజా, నాథన్ ఎల్లిస్, హర్ ప్రీత్ బ్రార్, రాహుల్ చాహెర్, అర్ష్దీప్ సింగ్
-
కోల్ కతా బ్యాటింగ్
టాస్ గెలిచిన కోల్ కతా కెప్టెన్ నితీశ్ రాణా మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.