అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా క్రిస్ మోరిస్.. రూ.16.25 కోట్లకు రాజస్థాన్ కొనేసింది

అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా క్రిస్ మోరిస్.. రూ.16.25 కోట్లకు రాజస్థాన్ కొనేసింది

Morris sold to Royals for Rs. 16.25 crore : ఐపీఎల్ వేలంలో సౌత్ ఆఫ్రికన్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ అదరగొట్టేశాడు. వేలంలో పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. క్రిస్ మోరిస్ రూ.16.25 కోట్ల భారీ ధర పలికాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ క్రిస్ మోరిస్‌ను దక్కించుకుంది.

క్రిస్ మోరిస్ కోసం పంజాబ్, రాజస్థాన్ గట్టి పోటీనిచ్చాయి. మోరిస్ కోసం బిడ్డింగ్ చేయగా.. చివరికి రాజస్థాన్ సొంతం చేసుకుంది. గతంలో మోరిస్ ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిథ్యం వహించాడు.
వేలంలో ముంబై ఇండిన్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ బిడ్డింగ్ కోసం పోటీ పడ్డాయి. ఇందులో రాజస్థాన్ రాయల్స్ చివరకు రూ.16.25 కోట్లకు మోరిస్ ను దక్కించుకుంది. దాంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా మోరిస్ రికార్డు సృష్టించాడు.

మోరిస్ తన ఐపీఎల్ జర్నీని చెన్నైతో మొదలుపెట్టాడు. 2013లో 15 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ 2015లో సొంతం చేసుకుంది. ఆ తర్వాతి నాలుగు సీజన్లలో స్టయిలీష్ ఆల్ రౌండర్ ఢిల్లీ క్యాపిటల్ తరపున ఆడాడు.

https://10tv.in/iplauction2021-maxwell-sold-to-rcb-for-rs-14-25-crore/