IPL Final 2023: గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో టాస్ ఓడిన జట్లే కప్ గెలిచాయా? మరి ఈ సారి..

చివరి మూడు సీజన్ల ఫైనల్ మ్యాచుల్లోనూ టాస్ ఓడిన జట్లే ఫైనల్ మ్యాచుల్లో గెలిచాయి.

IPL Final 2023: గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో టాస్ ఓడిన జట్లే కప్ గెలిచాయా? మరి ఈ సారి..

IPL 2023

IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL-2023)లో ఇవాళ అసలుసిసలైన మ్యాచ్ జరగనుంది. ఎనిమిది జట్లను ఎదుర్కొని, లీగ్ మ్యాచులు, ప్లేఆఫ్ మ్యాచులు దాటుకుని ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSK vs GT) తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ ఎవరు గెలుస్తారా? అన్న విషయం కంటే ఎవరు ఓడుతారు? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అందుకు గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లోని గణాంకాలే కారణం.

అది 2022, మే 29… ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్. టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ తీసుకుంది రాజస్థాన్ రాయల్స్. ఆ మ్యాచులో మాత్రం హార్దిక్ పాండ్యా జట్టు గుజరాత్ విజయ దుందుభి మోగించింది.

అది 2021, అక్టోబరు 15…. ఆ సీజన్ ఐపీఎల్ (IPL 2021) లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు టాస్ గెలిచింది. అదే జట్టుపై మహేంద్ర సింగ్ ధోనీ టీమ్ సీఎస్కే చేతిలో ఓడిపోయింది.

అది 2020, నవంబరు 10… ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్… ఈ మ్యాచులోనూ ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది.. మ్యాచ్ ఓడింది. ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచి కప్పు గెలుచుకుంది.

అంటే, చివరి మూడు సీజన్ల ఫైనల్ మ్యాచుల్లోనూ టాస్ ఓడిన జట్లే ఫైనల్ మ్యాచుల్లో గెలిచాయి. దీంతో ఇవాళ కూడా టాస్ ఓడిన జట్టే ఫైనల్ మ్యాచ్ గెలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు. తమకు ఇష్టమైన జట్టు టాస్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు.

IPL 2023 Final: ఫైనల్ పోరులో గుజరాత్‌ విజయం ఖాయమా? గణాంకాలు ఏం చెబుతున్నాయంటే