LPL 2023 : క్రికెట్ లీగా లేదా పాముల లీగా..! మ‌రోసారి గ్రౌండ్‌లోకి వ‌చ్చిన పాము.. తృటిలో త‌ప్పించుకున్న ఉదాన‌

ఎక్క‌డైనా క్రికెట్ మ్యాచులు చూసేందుకు ప్రేక్ష‌కులు వ‌స్తుంటారు గానీ శ్రీలంక వేదిక‌గా జ‌రుగుతున్న లంక ప్రీమియ‌ర్ లీగ్‌(Lanka Premier League) 2023ను చూసేందుకు మాత్రం పాములు వ‌స్తున్నాయి.

LPL 2023 : క్రికెట్ లీగా లేదా పాముల లీగా..! మ‌రోసారి గ్రౌండ్‌లోకి వ‌చ్చిన పాము.. తృటిలో త‌ప్పించుకున్న ఉదాన‌

Snake in LPL

Snake in LPL 2023 : ఎక్క‌డైనా క్రికెట్ మ్యాచులు చూసేందుకు ప్రేక్ష‌కులు వ‌స్తుంటారు గానీ శ్రీలంక వేదిక‌గా జ‌రుగుతున్న లంక ప్రీమియ‌ర్ లీగ్‌(Lanka Premier League) 2023ను చూసేందుకు మాత్రం పాములు వ‌స్తున్నాయి. ఎల్‌పీఎల్ టోర్నీలో మ‌రోసారి పాము క‌ల‌క‌లం రేపింది. శ‌నివారం (ఆగ‌స్టు 12)న కొలొంబొలోని ప్రేమ‌దాస స్టేడియంలో జ‌ఫ్నాకింగ్స్‌, బి ల‌వ్ క్యాండీ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో మ‌రోసారి అనుకోని అతిథిలా పాము వ‌చ్చింది.

మ్యాచ్ చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతుండ‌గా (జ‌ప్ఫా ఇన్నింగ్స్ 18వ ఓవ‌ర్‌లో) ఓ పాము మైదానంలోకి వ‌చ్చింది. నువాన్ ప్ర‌దీప్ బౌలింగ్ చేసేందుకు సిద్దమై ఫీల్డింగ్ సెట్ చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పాము ఫీల్డ‌ర్ ఇరుసు ఉదాన‌కు స‌మీపంలోంచి వెళ్లింది. కొంచెమైతే అత‌డు దానిపై కాలు వేసేవాడే. తృటిలో త‌ప్పించుకున్నాడు. పామును చూసి అత‌డు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాడు.

IND vs WI : గిల్‌, య‌శ‌స్విల భాగ‌స్వామ్యం పై వ‌సీం జాఫ‌ర్ హిలేరియ‌స్ వీడియో.. ఓ సారి చూసేయండి..?

మైదానంలో నుంచి బ‌య‌టకు వెళ్లిన పాము బౌండరీ లైన్ బ‌య‌ట ఉన్న‌ కెమెరాల వద్దకు వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కాగా.. ఇదే టోర్నీలో ఈ సీజ‌న్‌లోనే జూలై 31న దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ జ‌రిగిన మ్యాచ్‌లో సైతం పాము మైదానంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇది క్రికెట్ లీగ్ కాద‌ని పాముల లీగ్‌లా మారింద‌ని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

IND vs WI 4th T20 : దంచికొట్టిన భార‌త ఓపెన‌ర్లు.. నాలుగో టీ20లో టీమ్ఇండియా ఘ‌న‌ విజ‌యం.. సిరీస్ స‌మం

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన క్యాండీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 178 ప‌రుగులు చేసింది. మ‌హ్మ‌ద్ హారీస్ 81 ప‌రుగుల‌తో రాణించాడు. అనంత‌రం 171 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జాఫ్నా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్లు కోల్పోయి 170 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో 8 ప‌రుగుల‌తో ఓట‌మి పాలైంది. షోయ‌బ్ మాలిక్‌(55), పెరీరా(36) లు జాఫ్నాను గెలిపించేందుకు విఫ‌ల‌య‌త్నం చేశారు.

CPL 2023 : క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. స్లో ఓవ‌ర్ రేటుకు భారీ మూల్యం.. రెడ్ కార్డు.. ఐదు ప‌రుగుల కోత ఇంకా..