BCCI: “మహిళా క్రికెట్ జట్టు కోసం మగాళ్ల డ్రెస్సులు సైజ్ చేశారు”

బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ ఛైర్మన్ వినోద్ రాయ్ మహిళా క్రికెట్ గురించి సంచలన కామెంట్ చేశాడు. రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని గతం గురించి రాసిన ..

BCCI: “మహిళా క్రికెట్ జట్టు కోసం మగాళ్ల డ్రెస్సులు సైజ్ చేశారు”

Vinod Rai

BCCI: బీసీసీఐ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ మాజీ ఛైర్మన్ వినోద్ రాయ్ మహిళా క్రికెట్ గురించి సంచలన కామెంట్ చేశాడు. రీసెంట్ గా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతని గతం గురించి రాసిన “Not just a Nightwatchman” బుక్ గురించి మాట్లాడాడు. కిట్ మ్యాన్యుఫ్యాక్చరర్లు అయిన నైక్ కు మహిళల కోసం సపరేట్ జెర్సీలు డిజైన్ చేయమని అడిగానని వెల్లడించాడు.

“మహిళా క్రికెట్‌కు ఎటువంటి అటెన్షన్ ఉండేది కాదు. దురదృష్టవశాత్తు 2006వరకూ ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు కూడా. శరద్ పవార్ చొరవ తీసుకుని మహిళా క్రికెట్, పురుషుల క్రికెట్ ను అసోసియేషన్ లో కలిపేంత వరకూ దారుణంగా ఉంది. మహిళా ప్లేయర్లకు ఇచ్చే జెర్సీలను పురుషుల జట్టు కోసం కేటాయించిన జెర్సీలనే రీ సైజ్, రీ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేవాళ్లని అప్పుడే నాకు తెలిసింది. నైక్ వాళ్లను కాంటాక్ట్ అయి మహిళా జట్టుకు వేరే జెర్సీ ఉండాలని చెప్పా”

“మహిళా జట్టుకు సపరేట్ జెర్సీ ఉండాలనేది నా నమ్మకం. కోచింగ్ ఫెసిలిటీస్, ట్రావెట్ ఫెసిలిటీస్, మ్యాచ్ ఫీజులు, రిటైనర్లను ఎంచుకోవడం వంటివన్నింటికీ పరిష్కారం చూపించా” అని రాయ్ అన్నారు.

Read Also: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చిన బీసీసీఐ

2017 ఐసీసీ వరల్డ్ కప్‌లో.. ఇండియా ఫైనల్‌కు వెళ్లిన తర్వాతే మహిళా జట్టుపై నమ్మకమొచ్చిందని అంటున్నారు.
“2017 మహిళల వరల్డ్ కప్‌లో [ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ 171* పరుగులు చేసిన మ్యాచ్ వరకు మహిళల క్రికెట్‌పై తగిన శ్రద్ధ చూపలేదని అనుకున్నా. ఆమె నాతో అంది..”సార్, నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. పెద్దగా పరుగెత్తలేకపోయాను. సిక్స్‌లు మాత్రమే ఆడాను. హోటల్‌లో మాకు అనుకున్న ఆహారం లభించలేదని వివరించింది. ఉదయం అల్పాహారంగా సమోసాలు మాత్రమే తీసుకున్నారట” అని రాయ్ తెలిపారు.

అలా మహిళా జట్టుకు ప్రాధాన్యత తక్కువగా ఉండేదంటూ వివరించారు రాయ్.