Flying Sikh Milkha Singh : ఐసీయూలో మిల్కా సింగ్

ప్రముఖ అథ్లెట్ క్రీడాకారుడు మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో ఐసీయూకి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

Flying Sikh Milkha Singh : ఐసీయూలో మిల్కా సింగ్

Milkha Singh Admitted To Pgimer Hospital

Milkha Singh Admitted To PGIMER Hospital : ప్రముఖ అథ్లెట్ క్రీడాకారుడు మిల్కా సింగ్ మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు చండీఘడ్ లోని PGIMER ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి అంతగా బాగా లేకపోవడంతో ఐసీయూ (ICU)కి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.

91 ఏళ్ల వయస్సున్న మిల్కా సింగ్..మే 20వ తేదీన కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. హోం ఐసోలేషన్ లో ఉంటూ..వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకున్నారు. అనంతరం మొహాలీలోని ఆసుపత్రిలో చేరాడు. కొద్ది రోజులకు కరోనా నుంచి కోలుకున్న మిల్కా…గత ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక మిల్కా సింగ్ విషయానికి వస్తే..భారత అథ్లెట్ గా మంచి పేరు పొందారు. కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధించారు. 1958లో జరిగిన కామన్ వెల్త్ గేమ్ లో అంచనాలకు మించి రాణించి స్వర్ణ పతకం గెలుపొందారు. భారత ప్రభుత్వం ఇతడిని పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. 1960లో రోమ్ లో జరిగిన ఒలింపిక్స్ లో 400 మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్న మిల్కా..ఫైనల్ చేరారు. కానీ నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్ లో ఫైనల్ కి చేరిన తొలి భారత పురుష అథ్లెట్ గా రికార్డు నెలకొల్పారు. 1956, 1960, 1964 ఒలింపిక్స్‌లో భారత్‌కి మిల్కాసింగ్ ప్రాతినిధ్యం వహించారు.

Read More : Jobs For Locals : తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 95శాతం ఉద్యోగాలు స్థానికులకే