US Open : ఓటమి తర్వాత..రాకెట్‌ను నేలకేసి కొట్టాడు, భావోద్వేగం

మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించాడు. మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ ఫైట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌కు మట్టి కరిపించి.. తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించారు.

10TV Telugu News

US Open Novak : యూఎస్‌ ఓపెన్‌లో రష్యా టెన్నిస్‌ స్టార్‌ మెద్వెదెవ్‌ సంచలనం సృష్టించాడు. మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్‌ ఫైట్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ నొవాక్‌ జకోవిచ్‌కు మట్టి కరిపించి.. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. దీంతో నొవాక్ జకోవిచ్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. మనస్థాపానికి గురైన అతను…భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. మెద్వెదేవ్ తో 6-4, 6-4, 6-4 తేడాతో ఓటమి పాలయ్యాక..తన రాకెట్ ను నేలకేసి కొట్టాడు..అనంతరం కన్నీటి పర్యంతమయ్యాడు.

Read More : Medvedev : యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌.. జకోవిచ్‌కు నిరాశ

పదే పదే బ్యాట్ ను నేలకేసి కొట్టడంతో ఓ వైపు వంగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక టోర్నీ అనంతరం జకోవిచ్ మాట్లాడారు. టైటిల్ కోసం కొన్ని వారాలుగా మానసికంగా..శారీరకంగా…ఎంతో ఒత్తిడికి లోనయ్యాయనని, ఆ మానసిక సంఘర్షణను తట్టుకోవడం చాలా కష్టమైందన్నారు. ఓటమి తనను తీవ్రంగా కలిచివేసిందని, తన కోసం సమయం కేటాయించిన అభిమానులకు అతను ధన్యవాదాలు తెలియచేశారు.

Read More : Novak Djokovic: చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో జకోవిచ్

న్యూయార్క్‌ సిటీలోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో అభిమానుల కోలాహాలం మధ్య జరిగిన ఫైనల్‌ పోరులో మెద్వెదెవ్ విశ్వరూపం చూపించాడు. ఆట ప్రారంభమైనప్పటి నుంచి జకోను ముప్పతిప్పలు పెట్టాడు. జకో తప్పిదాలను సొమ్ము చేసుకుంటూ మొదటి నుంచి ఆధిక్యంలోనే కొనసాగాడు మెద్వెదెవ్. తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్‌ పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్‌ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు.

Read More : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా జకోవిచ్

అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా మెద్వెదెవ్‌ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో సెర్బియా యోధుడు జకోవిచ్‌ మొదట తేలిపోయినప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదెవ్‌ విజయాన్ని జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో మెద్వెదెవ్‌ 6-4 తేడాతో గెలిచాడు. దీంతో మెద్వెదెవ్‌ మూడో సెట్‌ను గెలిచి టెన్నిస్‌లో సరికొత్త చరిత్రకు నాంది పలికాడు. 2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలైన ఈ రష్యా వీరుడు ఇప్పుడు టైటిల్‌ గెలిచి రేసులోకి వచ్చాడు. దాదాపు పదేళ్ల తర్వాత యూఎస్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌లో కేవలం ఒక్కసెట్‌లో మాత్రమే ఒడిపోయి టైటిల్‌ గెలిచిన ఆటగాడిగా మెద్వెదెవ్‌ నిలిచాడు. అంతేకాదు ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌లో జకోవిచ్‌ చేతిలో చవిచూసిన పరాజయానికి బదులు తీర్చుకున్నాడు.

10TV Telugu News