MS Dhoni: సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు గాలికే,.. ఏడో ఓటమిపై ఎంఎస్ ధోనీ కామెంట్లు

డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో ఏడో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పరాజయానికి గురై ప్లేఆఫ్ ఆశలు గాలికొదిలేసింది.

MS Dhoni: సీఎస్కే ప్లేఆఫ్ ఆశలు గాలికే,.. ఏడో ఓటమిపై ఎంఎస్ ధోనీ కామెంట్లు

Csk Ms Dhoni

 

 

MS Dhoni: డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో ఏడో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పరాజయానికి గురై ప్లేఆఫ్ ఆశలు గాలికొదిలేసింది. చెన్నైకి ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. కొత్త కెప్టెన్ గా రవీంద్ర జడేజాను ఎంపిక చేయడం లోటేనని చెప్పాలి.

ఎట్టకేలకు కెప్టెన్సీ పగ్గాలు ధోనీ అందుకున్నప్పటికీ… అప్పటికే ఆలస్యమైపోయింది. ఆర్సీబీతో మ్యాచ్ అనంతరం సీఎస్కే ఓటమిపై కెప్టెన్ ధోనీ ఇలా చెప్పుకొచ్చాడు.

డెవాన్ కాన్వాయ్, రుతురాజ్ గైక్వాడ్ గుడ్ స్టార్ట్ ఇచ్చినా పరిస్థితుల ప్రభావంతో 160పరుగులు మాత్రమే చేసి 13పరుగుల తేడాతో ఓడిపోయింది.

Read Also: అలా చూస్తే ఎంఎస్ ధోనీ.. దినేశ్ కార్తీక్ సమానమే

“170పరుగులకే కట్టడి చేయాలని భావించి.. మంచి ఆరంభమే నమోదు చేశాం. మ్యాచ్ మొత్తంలో బ్యాట్స్ మన్ ప్రదర్శన ఆకట్టుకోలేకపోయింది. చేధనలో ఉన్న సమయంలో రెగ్యూలర్ ఆట తీరు మాత్రమే కాకుండా పరిస్థితికి తగ్గట్లుగా షాట్స్ ఆడేందుకు ప్రయత్నించాలి. షాట్ సెలక్షన్ ఇంకొంచెం బాగుండాల్సింది. మంచి ఆరంభం నమోదు చేశాం. ఇంకా చాలా వికెట్లు మిగిలే ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ నిలకడ లోపం జట్టును కుంగదీసింది” అని మ్యాచ్ అనంతరం ధోనీ వివరించాడు.

“ఈ విషయాలను గుర్తుంచుకుని కొన్నిసార్లు పాత ఆటతీరును ప్రదర్శించాల్సి ఉంటుంది. చేధనలో ఉన్నామంటే బ్యాటింగ్‌లో కాలిక్యులేషన్ కచ్చితంగా ఉండాలి. బ్యాటర్ గా లేదంటే బౌలర్ గానైనా మనమే డిసైడ్ అయి ఆటను ప్రదర్శించాలి” అని ధోనీ ముగించాడు.