MS Dhoni Warning : అలా అయితే కెప్టెన్సీ వదిలేస్తా.. సీఎస్‌కే బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఏకంగా 18 ఎక్స్‌ట్రాలు వేశారు. తొలి మ్యాచ్‌లోనూ 12 ఎక్స్‌ట్రాలు వేశారు. తొలి మ్యాచ్‌లో అత్యధికంగా ఎక్స్‌ట్రాలు వేయడంతో ధోనీ బౌలర్లకు వైడ్లు, నోబ్ బాల్స్ వేయొద్దంటూ సూచించాడు. అయినా, రెండో మ్యాచ్‌లో భారీగా అదనపు పరుగులు సమర్పించుకున్నారు. దీంతో కెప్టెన్ కూల్ ధోనీకి చిరెత్తుకొచ్చింది.

MS Dhoni (Photo _ IPL)
MS Dhoni Warning : టీమిండియా మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ (Mahender Singh Dhoni) .. ఈ పేరు వినగానే .. ముందుగా క్రికెట్ ప్రియులకు గుర్తుకొచ్చేది ‘కెప్టెన్ కూల్’ (Captain cool) అని. మ్యాచ్ ఎంత ఉత్కంఠభరితంగా సాగుతున్నా ఎం.ఎస్. ధోనీ మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా జట్టును విజయతీరాలకు చేర్చుతాడు. ఛేజింగ్ సమయంలో లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టాల్సి ఉన్నా.. ఏ మాత్రం హైరానా పడకుండా కూల్‌గా సిక్స్ కొట్టేసి జట్టును విజేతగా నిలుపుతాడు. అందుకే ఎం.ఎస్. ధోనీ అంటే క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అలాంటి ధోనీ అసహనానికి గురయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) జట్టు బౌలర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇలా అయితే నేను కెప్టెన్సీ చేయను అంటూ హెచ్చరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ గా మారింది.
MS Dhoni: ధోనీ క్రీజ్‌లోకి వచ్చాడంటే అంతేమరి.. జియోసినిమా యాప్‌లో రికార్డు స్థాయిలో వీక్షకులు
ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభమైంది. మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ధోనీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) జట్టు తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. సోమవారం రాత్రి రెండో మ్యాచ్‌లో సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ చెపాక్ మైదానంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే జట్టు 217 భారీ స్కోరును నమోదు చేసింది. 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 12 పరుగుల తేడాతో మాత్రమే ఓడిపోయింది. చివరి వరకు లక్నో బ్యాటర్లు విజయంకోసం ప్రయత్నించారు. దాదాపు లక్నో జట్టు గెలిచినంత పనిచేసింది. ఇందుకు ప్రధాన కారణం సీఎస్‌కే బౌలర్లు ఎక్కువ ఎక్స్‌ట్రాలు వేయడమే.
#CSK bowlers today bowled 13 wides and 3 no balls against #LSG and Captain @msdhoni, in his inimitable style, had this to say. ??#TATAIPL | #CSKvLSG pic.twitter.com/p6xRqaZCiK
— IndianPremierLeague (@IPL) April 3, 2023
చెన్నై బౌలర్లు ఏకంగా 18 ఎక్స్‌ట్రాలు వేశారు. ఇందులో రెండు లెగ్‌బైస్‌లు, 13 వైడ్లు, మూడు నోబాల్స్ ఉన్నాయి. తొలి మ్యాచ్ లోనూ 12 ఎక్స్‌ట్రాలు వేశారు. తొలి మ్యాచ్ లో అత్యధికంగా ఎక్స్‌ట్రాలు వేయడంతో ధోనీ బౌలర్లకు వైడ్లు, నోబ్ బాల్స్ వేయొద్దంటూ సూచించాడు. అయినా, రెండో మ్యాచ్‌లో ఏకంగా 18 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. దీంతో కూల్ కెప్టెన్ ధోనీకి చిరెత్తుకొచ్చింది. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. బౌలర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఫాస్ట్ బౌలింగ్ ను మేం మెరుగుపర్చుకోవాలి. పరిస్థితులకు తగినట్లుగా బౌలింగ్ చేయాలి. ముఖ్యంగా బౌలర్లు వైడ్, నోబ్ బాల్స్ వేయడం తగ్గించుకోవాలి. లేదంటే ఇక కొత్త సారథి కింద వారు ఆడాల్సి ఉంటంది. ఇది నా రెండో వార్నింగ్. ఇకపై మరోసారి ఇలా జరిగితే నేను వైదొలుగుతా అంటూ ధోనీ సీఎస్‌కే బౌలర్లను హెచ్చరించాడు. ధోనీ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైర్ అవుతుంది.