IPL 2019: ఎంఎస్ ధోనీ నెం.4లో బ్యాటింగ్

IPL 2019: ఎంఎస్ ధోనీ నెం.4లో బ్యాటింగ్

IPL 2019: ఎంఎస్ ధోనీ నెం.4లో బ్యాటింగ్

టీమిండియా మేనేజ్‌మెంట్ భారత జట్టు ఆడే విదేశీ మ్యాచ్‌లలో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు దింపుతోంది. అదే పద్ధతిని కొనసాగిస్తామని అంటే నాలుగో స్థానంలో బరిలోకి దింపే యోచనలో ఉన్నామని చెన్నై కోచ్ ఫ్లెమింగ్ తెలిపాడు. 

’10 నెలల నుంచి చూస్తే ధోనీ ఫామ్‌లోనే కనిపిస్తున్నాడు. 2018 సీజన్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సత్తా చాటాడు. అదే కొనసాగించాలనుకుంటున్నాం. ధోనీతో పాటు మరో బ్యాట్స్‌మన్‌గా కేదర్ జాదవ్ కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో రాణించగలమనే నమ్మకముంది. ఇతర జట్ల బలాబలాలతో పోల్చుకుంటే మనం ఆడలేం’

‘అలా చేస్తే మనం ట్రాప్ అయినట్లే..  ప్రతి జట్టులో సరిపడనంత నైపుణ్యమున్న ఆటగాళ్లున్నారు. గత సీజన్లో అద్భుతాలు సృష్టించాం. ఫాప్ డుప్లెసిస్, బ్రావో, వాట్సన్‌లు జట్టుకు గట్టి బలాన్ని చేకూరుస్తారని భావిస్తున్నా’ అని తెలిపాడు. 

‘జట్టులో ఫేస్ బౌలర్లు ఉన్నారు. ఇమ్రాన్ తాహిర్ మంచి ఫామ్ లో ఉన్నాడు.  కర్ణ్ శర్మ, హర్భజన్ సింగ్ ల అనుభవం జట్టుకు ప్లస్ గా మారుతుందని భావిస్తున్నాను’ అని కోచ్ వెల్లడించాడు. 

×