Rafael Nadal : ఫ్యాన్స్‌‌కు షాక్, నాదల్ సంచలన నిర్ణయం

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ షిప్ విజేత రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. రాబోయే వింబుల్డన్ ఛాంపియన్ షిప్, టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్స్ చేశారు.

Rafael Nadal : ఫ్యాన్స్‌‌కు షాక్, నాదల్ సంచలన నిర్ణయం

Rafael Nadal

Rafael Nadal : ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, 20 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ షిప్ విజేత రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. రాబోయే వింబుల్డన్ ఛాంపియన్ షిప్, టోక్యో ఒలింపిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్స్ చేశారు. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు ప్రశ్నలు కురిపిస్తున్నారు. తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, కొన్ని సంవత్సరాల పాటు కెరీర్ పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.

వింబుల్డన్, ఒలిపింక్ క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు, తన బృందంతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అయితే..ఇది తేలికపాటి నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించడం, సంతోషం కలిగించే పనులు చేయడమే తన లక్ష్యమన్నారు. ప్రపంచవ్యాప్తంగా తనకు అభిమానులున్నారని, అయితే..యూకే, జపాన్ లో ఉన్న వారికి ప్రత్యేక సందేశం పంపాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఒలింపిక్స్ లో పతకం సాధించాలని తాను కోరుకున్నానని, దేశ జెండాకు గౌరవం తెచ్చే వ్యక్తిగా ఎంతో బాధ్యతగా ఉంటానని ట్వీట్ లో వెల్లడించారు. 35 ఏళ్ల నాదల్..ఫ్రెంచ్ ఓపెన్ లో మూడో మ్యాచ్ లో ఓడి వెనుదిరిగారు.

2008, 2010లో రెండుసార్లు వింబుల్డన్ గెలుచుకున్న నాదల్ 2008లో పురుషుల సింగిల్స్ టెన్నిస్‌లో ఒలింపిక్ స్వర్ణం సాధించారు. ఈ నెల ప్రారంభంలో రోలాండ్ గారోస్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో నోవాక్ జొకోవిక్ చేతిలో పరాజయం పాలైయ్యారు.