Mohammad Siraj : సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీ ఇవ్వండి.. ఆనంద్ మ‌హీంద్రా ఎమ‌న్నారంటే..?

ఆసియా క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో భార‌త పేస‌ర్ సిరాజ్ (Siraj) శ్రీలంక పై తీసిన ఆరు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌నను అభిమానులు ఎవ్వ‌రూ కూడా అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు.

Mohammad Siraj : సిరాజ్‌కు ఓ ఎస్‌యూవీ ఇవ్వండి.. ఆనంద్ మ‌హీంద్రా ఎమ‌న్నారంటే..?

Mohammad Siraj -Anand Mahindra

Mohammad Siraj -Anand Mahindra : ఆసియా క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో భార‌త పేస‌ర్ సిరాజ్ (Siraj) శ్రీలంక పై తీసిన ఆరు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌నను అభిమానులు ఎవ్వ‌రూ కూడా అంత త్వ‌ర‌గా మ‌రిచిపోలేరు. త‌న కెరీర్‌లో ఓ అద్భుమైన డ్రీమ్ స్పెల్‌తో భార‌త్ ఆసియా క‌ప్ (Asia Cup) గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. అంతేనా త‌న‌కు వ‌చ్చిన ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ రివార్డును సైతం కొలంబో గ్రౌండ్ సిబ్బంది ఇచ్చి మంచి మ‌న‌సును చాటుకున్నాడు. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు తీసి టీమ్ఇండియా త‌రుపున ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ఆట‌గాడిగా నిలిచాడు.

ఈ క్ర‌మంలో సిరాజ్‌ను ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హీంద్రా ప్ర‌శంసించారు. మన ప్రత్యర్థుల కోసం ఇంత‌కుముందెన్న‌డూ త‌న హృదయం బాధ‌ప‌డలేద‌ని చెప్పారు. అయితే ఇప్పుడు వారిపై ఏదో అద్భుత‌మైన శ‌క్తి ప్ర‌యోగించిన‌ట్లుగా అనిపించింద‌ని అన్నారు. సిరాజ్ నువ్వొక మార్కెల్ అవెంజ‌ర్ అంటూ ఆనంద్ మ‌హీంద్ర ట్వీట్ చేశారు.

ఆనంద్ మ‌హీంద్రా చేసిన ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఓ నెటీజ‌న్ ఓ విజ్ఞ‌ప్తి చేశాడు. ‘స‌ర్ ద‌య‌చేసి అత‌డికి(సిరాజ్‌) ఒక ఎస్‌యూవీ ఇవ్వండి’ అని కోరాడు. దీనిపై ఆనంద్ మ‌హీంద్రా రిప్లై సైతం ఇచ్చాడు. గ‌తంలోనే అత‌డికి ఇచ్చిన‌ట్లుగా చెప్పాడు. 2021లో సిరాజ్‌కు మ‌హీంద్రా థార్‌ను బ‌హుమ‌తిగా అందించిన సంగ‌తి తెలిసిందే.

Asia Cup 2023: విరాట్ నడకను ఇమిటేట్ చేసిన ఇషాంత్ కిషన్.. కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

ఫైన‌ల్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే సిరాజ్ ధాటికి శ్రీలంక 15.2 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగుల‌కే ఆలౌటైంది. శ్రీలంక బ్యాట‌ర్ల‌లో కుశాల్ మెండీస్ (17), దుషన్ హేమంత (13) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్ చేశారు. ఐదుగురు బ్యాట‌ర్లు కుశాల్ పెరీరా, సదీరా సమరవిక్రమ, చరిత్‌ అసలంక, డాసున్‌ శానక, మతీషా పతిరన లు డ‌కౌట్లు అయ్యారు. అనంత‌రం 51 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 6.1 ఓవ‌ర్ల‌ వికెట్ న‌ష్ట‌పోకుండా టీమ్ఇండియా ఛేదించింది. ఓపెన‌ర్లు ఇషాన్ కిష‌న్ (23), శుభ్‌మ‌న్ గిల్ (27) లు మిగ‌తా బ్యాట‌ర్ల‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదు.