Asia Cup 2023: విరాట్ నడకను ఇమిటేట్ చేసిన ఇషాంత్ కిషన్.. కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. కోహ్లీకి గిల్, ఇషాంత్ కిషన్, హార్దిక్ పాండ్యా తోడయ్యారంటే ఇక అక్కడ నువ్వులేనవ్వులు.. అంత సరదాగా ఉంటారు.

Asia Cup 2023: విరాట్ నడకను ఇమిటేట్ చేసిన ఇషాంత్ కిషన్.. కోహ్లీ ఏం చేశాడంటే..? వీడియో వైరల్

Ishan Kishan and Virat Kohli

Ishan Kishan and Virat Kohli : ఆసియా కప్ 2023ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక – భారత్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు హైదరాబాదీ వాసి, టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజుద్దీన్ చుక్కలు చూపించారు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. బూమ్రా, ఇతర బౌలర్లు తమ సత్తాను చాటడంతో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టు కేవలం 6.1 ఓవర్లలో 51 పరుగుల టార్గెట్‌ను పూర్తిచేసి టోర్నీ విజేతగా నిలిచింది.

Asia Cup Prize Money: ఆసియా కప్ 2023లో విజేతగా నిలిచిన భారత్‌ జట్టుకు ప్రైజ్‌మనీ ఎంత లభించిందో తెలుసా?

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ సందడి వాతావరణం ఉంటుంది. కోహ్లీకి గిల్, ఇషాంత్ కిషన్, హార్దిక్ పాండ్యా తోడయ్యారంటే ఇక అక్కడ నువ్వులేనవ్వులు.. అంత సరదాగా ఉంటారు. ఈ క్రమంలోఆదివారం ఇండియా – శ్రీలంక జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ అనంతరం ఫ్రైజ్ డిస్టిబ్యూషన్ కార్యక్రమంకు ముందు ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Mohammad Siraj : సిరాజ్ గొప్ప మ‌న‌సు.. చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిపోయిన స్టేడియం

మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, ఇషాంత్ కిషన్, శుభ్‌మన్ గిల్, సిరాజుద్దీన్, హార్ధిక్ పాండ్యా, తిలక్ వర్మతో పాటు పలువురు టీమిండియా ప్లేయర్లు ఒక్కచోటుకు చేరారు. వీరంతా సరదాగా మాట్లాడుకుంటున్న క్రమంలో ఇషాంత్ కిషన్ కోహ్లీ నడకను ఇమిటేట్ చేస్తూ చూపించాడు. దీంతో కోహ్లీ సహా మిగిలిన ప్లేయర్స్ నవ్వాపుకోలేక పోయారు. కోహ్లీ వెంటనే స్పందిస్తూ అది నా నడక కాదు బాబూ.. నువ్వు ఇలా నడుస్తున్నావు అంటూ చూపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రీడాభిమానులు టీమిండియా ప్లేయర్స్ మధ్య సఖ్యతను చూసి మురిపోతూ సరదా కామెంట్స్ చేస్తున్నారు.