Mohammad Siraj : సిరాజ్ గొప్ప మ‌న‌సు.. చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిపోయిన స్టేడియం

హైద‌రాబాదీ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్ (Mohammad Siraj) ఆసియా క‌ప్ 2023 ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

Mohammad Siraj : సిరాజ్ గొప్ప మ‌న‌సు.. చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిపోయిన స్టేడియం

Mohammad Siraj donates prize money

Mohammad Siraj donates prize money : టీమ్ఇండియా స్టార్ పేస‌ర్‌, హైద‌రాబాదీ కుర్రాడు మ‌హ్మ‌ద్ సిరాజ్ (Mohammad Siraj) ఆసియా క‌ప్ 2023 ను భార‌త జ‌ట్టు సొంతం చేసుకోవ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఫైన‌ల్ మ్యాచులో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. అంతేనా మ్యాచ్ అనంత‌రం త‌న గొప్ప మ‌న‌సును చాటుకున్నాడు. ఫైన‌ల్‌లో ఆరు వికెట్ల‌తో లంక ప‌త‌నాన్ని శాసించిన సిరాజ్‌ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డికి ప్రైజ్‌మ‌నీగా 50 వేల యూఎస్ డాల‌ర్లు వ‌చ్చాయి. ఈ మొత్తాన్ని గ్రౌండ్ మెన్స్ ను అంద‌జేశాడు.

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంత‌రం సిరాజ్ మాట్లాడుతూ ఇదంతా ఓ క‌ల‌లా ఉంద‌న్నాడు. త‌న స్పెల్ ఎంతో సంతోషాన్ని ఇచ్చింద‌న్నాడు. ఈ రోజు పిచ్ ఎక్కువ‌గా స్వింగ్‌కు అనుకూలింది. దీంతో ఔట్ స్వింగ‌ర్ల‌తో ఎక్కువ వికెట్లు ప‌డ‌గొట్ట‌గ‌లిన‌ట్లు తెలిపాడు. బ్యాట‌ర్లు ముందుకు వ‌చ్చి ఆడేలా ట్రాప్ చేసి విజ‌య‌వంతం అయిన‌ట్లు చెప్పాడు. బౌండ‌రీ ఆపాల‌ని ప‌రుగెత్తాను. అయితే.. ఆపి ఉంటే మ‌రింత సంతోష‌ప‌డేవాడిన‌ని అన్నాడు.

ఇక గ్రౌండ్ మెన్స్ లేకుండా ఈ టోర్నీ సాధ్యం అయ్యేది కాదు. వాళ్ల క‌ష్టానికి గుర్తింపుగా నాకు వ‌చ్చిన ఈ ప్రైజ్ మ‌నీ మొత్తాన్ని వాళ్ల‌కు ఇచ్చేస్తున్నాను అని సిరాజ్ అన్నాడు. దీంతో ఒక్క‌సారిగా స్టేడియం మొత్తం చ‌ప్ప‌ట్ల‌తో మార్మోగిపోయింది. ఈ మ్యాచ్‌లో సిరాజ్ ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు తీశాడు. ఈ ఘ‌న‌త సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు.

Asia Cup 2023 : క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌ కృషికి భారీ నజరానా

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవ‌ర్ల‌లో 50 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆరు వికెట్ల‌తో మ‌హ్మ‌ద్ సిరాజ్ శ్రీలంక ప‌త‌నాన్ని శాసించాడు. అతనికి తోడుగా హార్దిక్ పాండ్య మూడు, జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ తీశారు. లంక బ్యాటర్లలో కుశాల్ మెండిస్(17), దుషన్ హేమంత(13)లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్ చేయ‌గా మిగిలిన వాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

అనంతరం 51 ప‌రుగుల లక్ష్యచేధనకు భార‌త్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా సునాయస ఛేదించింది. లక్ష్యం చిన్న‌దే కావ‌డంతో కెప్టెన్ రోహిత్ శర్మకు త‌న‌కు బ‌దులు ఓపెన‌ర్‌గా ఇషాన్ కిషన్(23) పంపాడు. శుభ్‌మన్ గిల్ (27) తో క‌లిసి ఇషాన్ లాంఛ‌నాన్ని పూర్తి చేశాడు.

Ind vs SL : 2, 0, 17, 0, 0, 4, 0, 8,13, 1, 0 ఫోన్ నంబ‌ర్ కాదు.. మ‌రేంటో తెలుసా..?