Asia Cup Prize Money: ఆసియా కప్ 2023 విజేతగా నిలిచిన భారత్‌ జట్టుకు ప్రైజ్‌మనీ ఎంత లభించిందో తెలుసా?

ఆసియా కప్ 2023 ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. దీంతో విజేతగా నిలిచిన రోహిత్ సేనకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది.

Asia Cup Prize Money: ఆసియా కప్ 2023 విజేతగా నిలిచిన భారత్‌ జట్టుకు ప్రైజ్‌మనీ ఎంత లభించిందో తెలుసా?

Team india

Updated On : September 18, 2023 / 10:13 AM IST

Asia Cup final 2023: ఆసియా కప్ 2023 ను టీమిండియా గెలుచుకుంది. ఎనిమిదోసారి భారత్ జట్టు ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఆదివారం సాయంత్రం కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక – భారత్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టుకు హైదరాబాదీ వాసి, టీమిండియా ఫాస్ట్ బౌలర్ సిరాజుద్దీన్ చుక్కలు చూపించారు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు పడగొట్టి శ్రీలంక టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. ఈ మ్యాచ్ లో సిరాజ్ కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. సిరాజ్ తో పాటు బుమ్రా, ఇతర బౌలర్లు తమ సత్తాను చాటడంతో శ్రీలంక కేవలం 50 పరుగులకే ఆటౌస్ అయింది. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా జట్టు కేవలం 6.1 ఓవర్లలో 51 పరుగుల టార్గెట్‌ను పూర్తిచేసి విజేతగా నిలిచింది.

Asia Cup 2023 : క్యూరేట‌ర్లు, గ్రౌండ్స్‌మెన్స్‌ కృషికి భారీ నజరానా

ఆసియా కప్ 2023 టైటిల్‌ దక్కించుకున్న భారత్ జట్టుకు భారీ మొత్తంలో ఫ్రైజ్ మనీ లభించింది. రోహిత్ సేన 1.25 కోట్లు (150000 డాలర్లు) ప్రైజ్ మనీగా అందుకుంది. రన్నరప్‌గా నిలిచిన శ్రీలంక జట్టుకు రూ. 62లక్షలు (75000 డాలర్లు) ప్రైజ్ మనీ లభించింది. అదేవిధంగా ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టు విజయానికి కారణమైన ఫాస్ట్‌బౌలర్ సిరాజ్‌ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో 4.16లక్షలు (5000 డాలర్లు) అందుకున్నాడు. ఆ మొత్తాన్ని శ్రీలంక గ్రౌండ్ మెన్స్‌కు అందజేశారు.

IND vs SL : ఆసియా క‌ప్ విజేత భార‌త్‌.. రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు గెలిచిన టీమ్ఇండియా

టీమిండియా స్పిన్ బౌలర్ కుల్దీప్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్ కుల్దీప్ కు లభించింది. ఈ మేరకు సుమారు రూ.12లక్షలు (15,000 డాలర్లు) ప్రైజ్ మనీగా అందుకున్నాడు.