Sachin Tendulkar Double Ton: సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది

Sachin Tendulkar Double Ton: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది. 13 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే ఫిబ్రవరి 24న చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో మాస్టర్ బ్లాస్టర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు.

Sachin Tendulkar Double Ton: సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది

Sachin Tendulkar Double Ton: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ జీవితంలో మరో మరపురాని రోజు ఇది. 13 ఏళ్ల క్రితం ఇదే రోజున అంటే ఫిబ్రవరి 24న చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో మాస్టర్ బ్లాస్టర్ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఫస్ట్ మెన్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ద్విశతకం సాధించి మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మధుర ఘట్టాన్ని గుర్తు చేస్తూ ఐసీసీ, బీసీసీఐ శుక్రవారం ట్వీట్ చేశాయి.

2010, ఫిబ్రవరి 24న గ్వాలియర్ లోని కెప్టెన్ రూప్ సింగ్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో సచిన్ టెండూల్కర్ అజేయ ద్విశతకం సాధించాడు. 147 బంతుల్లో 25 ఫోర్లు, 3 సిక్సర్లతో డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. సచిన్ విజృంభణతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో భారత్ 153 పరుగుల భారీ తేడాతో సఫారీ జట్టును చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత తన ఇన్నింగ్స్ ను దేశ ప్రజలకు అంకితం ఇస్తున్నట్టు సచిన్ ప్రకటించాడు.


డబుల్ సెంచరీ చేయడానికి ముందు వన్డేల్లో సచిన్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 186 పరుగులు. 1999లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మాస్టర్ ఈ స్కోరు సాధించాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లతో కలిపి అత్యధిక పరుగులు సాధించిన రికార్డు ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది.