Kohli vs Sachin: విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లో ఎవరు గొప్ప?.. కపిల్ దేవ్ స్పందన

గడిచిన తరాల కంటే కొత్త తరంలో మెరుగైన ఆటగాళ్లు ఉంటారని కపిల్ దేవ్ చెప్పారు. ఎవరు ఉత్తమ ఆటగాడు? అన్న విషయాన్ని ఏదో ఓ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పలేమని అన్నారు. జట్టు అంటే 11 మంది సభ్యులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఎవరి ఇష్టాఅయిష్టాలు వారికి ఉంటాయని, అయితే, తరం మారుతున్న కొద్దీ మరింత ఉత్తమైన ఆటగాళ్లు వస్తుంటారని తెలిపారు.

Kohli vs Sachin: విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌లో ఎవరు గొప్ప?.. కపిల్ దేవ్ స్పందన

India-Pakistan match

Kohli vs Sachin: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లో ఎవరు గొప్ప? అన్న చర్చ జరుగుతున్న వేళ కొందరు సచిన్ తర్వాతే కోహ్లీ అని, మరికొందరు కోహ్లీనే ఉత్తమ ఆటగాడని వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. సచిన్, కోహ్లీలో ఎవరు ఉత్తమ ఆటగాడు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

గడిచిన తరాల కంటే కొత్త తరంలో మెరుగైన ఆటగాళ్లు ఉంటారని చెప్పారు. ఎవరు ఉత్తమ ఆటగాడు? అన్న విషయాన్ని ఏదో
ఓ ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పలేమని అన్నారు. జట్టు అంటే 11 మంది సభ్యులు ఉంటారని వ్యాఖ్యానించారు. ఎవరి ఇష్టాఅయిష్టాలు వారికి ఉంటాయని, అయితే, తరం మారుతున్న కొద్దీ మరింత ఉత్తమైన ఆటగాళ్లు వస్తుంటారని తెలిపారు.

తమ కాలంలో సునీల్ గవాస్కర్ ఉత్తమ ఆటగాళ్లలో ఒకరని, అనంతరం తాము రాహుల్ ద్రవిడ్, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ను చూశామని వ్యాఖ్యానించారు. ప్రస్తుత తరంలో రోహిత్, విరాట్ కోహ్లీ ఉన్నారని చెప్పారు. తదుపరి తరం మరింత ఉత్తమమైన ఆటగాళ్లను చూస్తామని తెలిపారు. మరింత ఉత్తమ ఆటగాడిని, ఉత్తమ ప్రదర్శననను చూస్తామని అన్నారు.

కాగా, 34 ఏళ్ల కోహ్లీ ఇప్పటికే 74 సెంచరీలు చేశాడు. అందులో టెస్టుల్లో 27, వన్డేల్లో 46, టీ20ల్లో ఒకటి ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ తన కెరీర్ లో మొత్తం 100 సెంచరీలు చేశారు. అందులో 51 సెంచరీలు టెస్టుల్లో, 49 సెంచరీలు వన్డేల్లో ఉన్నాయి. వన్డేల్లో మరో మూడు సెంచరీలు చేస్తే విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తో సమానంగా 49 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్ గా నిలుస్తాడు.

Veera Simha Reddy : హనీ రోజ్‍తో సిప్ వేస్తున్న బాలయ్య.. వైరల్ అవుతున్న ఫోటో!