Rohit Sharma 9th Test Century: రోహిత్ శర్మ సెంచరీ బాదుడు.. మరో రికార్డు కొట్టేశాడుగా

Rohit Sharma 9th Test Century: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల దాహం తీర్చుకున్నాడు. సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాదు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

Rohit Sharma 9th Test Century: రోహిత్ శర్మ సెంచరీ బాదుడు.. మరో రికార్డు కొట్టేశాడుగా

Rohit Sharma 9th Test Century: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పరుగుల దాహం తీర్చుకున్నాడు. టెస్టుల్లో మూడంకెల స్కోరు సాధించి విమర్శకుల నోటికి తాళం వేశాడు. లాంగ్ ఫార్మట్ లో సెంచరీ కోసం చాలా రోజులుగా వేచి చూస్తున్న హిట్ మాన్ ఎట్టకేలకు తన లక్ష్యం చేరుకున్నాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీ బాదాడు. అంతేకాదు సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

మూడు ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన తొలి భారత కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది 9వ సెంచరీ. అయితే టెస్ట్ కెప్టెన్ గా మాత్రం ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. తనదైన శైలిలో ఆడుతూ 171 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు.

కేఎల్ రాహుల్, పుజారా, విరాట్ కోహ్లి సహా స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ కు వరుసగా క్యూ కట్టినా రోహిత్ మాత్రం పట్టుదలగా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. సహచరులంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నా ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని సెంచరీతో మెరిశాడు. విలువైన భాగస్వామ్యాలు నమోదు చేసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళుతున్నాడు. రోహిత్ రాణించడంతో భారత్ స్కోరు 200 పరుగులు దాటింది.

Also Read: అశ్విన్ అదరహో.. అనిల్ కుంబ్లే రికార్డును దాటేశాడుగా!

35 ఏళ్ల రోహిత్ శర్మ 46వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. అతడి ఖాతాలో 9 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 241 వన్డేలు ఆడిన రోహిత్ 30 సెంచరీలు, 48 అర్ధసెంచరీలతో 9782 పరుగులు చేశాడు. 148 అంతర్జాతీయ టీ20ల్లో నాలుగు సెంచరీలతో 3853 పరుగులు సాధించాడు.