Sachin Tendulkar: సచిన్ కూతురు మొదటి అడుగేసేసింది.. అరంగేట్రంలోనే అదుర్స్

సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది.

Sachin Tendulkar: సచిన్ కూతురు మొదటి అడుగేసేసింది.. అరంగేట్రంలోనే అదుర్స్

Sara Tendulkar

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫ్యాషన్ లో ఎప్పుడూ తగ్గలేదు. తండ్రి క్రికెట్ రంగంలో కింగ్ అయినప్పటికీ తన ప్రత్యేకత కోసం మోడలింగ్ రంగాన్ని ఎంచుకుంది. ఈ మేరకు పాపులర్ క్లాతింగ్ బ్రాండ్ కోసం మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యాక్టర్స్ అయిన బనితా సంధు, టానియా ష్రాప్ తో కలిసి ఓ ప్రమోషనల్ వీడియోలో కనిపించారు.

సారా ఎంట్రీపై టెండూల్కర్ ఫ్యాన్స్ అంతా ఖుషీ అవుతున్నారు. అఫీషియల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను పోస్టు చేసింది. అందులో ఒకొక్కరుగా ఫోజులిచ్చిన వాళ్లు ఒక షాట్ లో ఒకేచోట నిల్చొని ఉన్నారు. వీడియో తీసిన పద్ధతితో ఆ మోడల్స్ అందం మరింత పెరిగిపోయింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో సారా టెండూల్కర్ డైలీ లైఫ్ గురించి షేర్ చేసుకుంటూ ఫాలోవర్లకు చాలా క్లోజ్ గా ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ ట్రెండ్ తో 1.5మిలియన్ మంది ఫాలోవర్లను మంత్ర ముగ్ధులను చేయడం ఖాయం.

…………………………………. : చెడ్డీ‌గ్యాంగ్ వేటలో తాడేపల్లి పోలీసులు

సచిన్ కూతురు సారా టెండూల్కర్.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివి లండన్ లో గ్రాడ్యుయేషన్ పొందారు.