షాన్ శతక్కొట్టుడు : కెరీర్‌లో 7వ సెంచరీ

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 06:34 AM IST
షాన్ శతక్కొట్టుడు : కెరీర్‌లో 7వ సెంచరీ

అడిలైడ్: భారత్‌తో రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ షాన్ మార్ష్ చెలరేగిపోయాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ సెంచరీ బాదాడు. 10 ఫోర్ల సాయంతో 108 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మార్ష్ వన్డే కెరీర్‌లో ఇది 7వ సెంచరీ. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా షాన్ మార్ష్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో శతకం పూర్తి చేశాడు.

 

నిర్ణయాత్మకమైన రెండో వన్డేలో టాస్ గెల్చిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 41 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. షమీ వేసిన ఎనిమిదో ఓవర్‌లో కారే(18) ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. అంతకుముందు ఓవర్‌లో కెప్టెన్‌ ఫించ్‌(6) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీస్‌ గెలిచిన ఉత్సాహంతో వన్డే సిరీస్‌కు బరిలోకి దిగిన భారత్‌కు తొలి మ్యాచ్‌లో అనూహ్య ఫలితం ఎదురైంది. భారత్‌తో పోలిస్తే అన్ని విభాగాల్లో అనుభవం తక్కువగా ఉన్న ఆసీస్‌ ముందు టీమ్ ఇండియా తలవంచింది. సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా గెలిచి తీరాలి.