Smriti Mandhana: వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా స్మృతి మంధాన

రాబోయే వరల్డ్ కప్ సీజన్‌ తర్వాత స్మృతి మంధాననే కెప్టెన్సీ అవబోతున్నట్లు టీమిండియా మాజీ మహిళా కోచ్ రామన్ చెప్పేశారు. ఈ మెగా టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండానే కెప్టెన్ అవనున్నారు.

Smriti Mandhana: వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్‌గా స్మృతి మంధాన

Smriti Mandana

Smriti Mandhana: రాబోయే వరల్డ్ కప్ సీజన్‌ తర్వాత స్మృతి మంధాననే కెప్టెన్సీ అవబోతున్నట్లు టీమిండియా మాజీ మహిళా కోచ్ డబ్ల్యూవీ రామన్ చెప్పేశారు. ఈ మెగా టోర్నీ ఫలితంతో సంబంధం లేకుండానే కెప్టెన్ అవనుందట. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ లో సెంచరీతో మెరిసిన మంధాన జట్టులో స్థైర్యాన్ని నింపారు.

కెప్టెన్సీ అనేది వయస్సుతో సంబంధం లేకుండా వచ్చేది. మంధాన కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గేమ్ ను కరెక్ట్ గా అర్థం చేసుకోగలదు. కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతుంది. యువ క్రికెటర్ కు కెప్టెన్సీ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అలా జరిగితే కొన్నేళ్ల పాటు జట్టును నడిపించగలరు’ అని రామన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

‘కాకపోతే కెప్టెన్సీ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదు. ఎందుకంటే రాబోయే వరల్డ్ కప్ ముందు సమయం కీలకం. రీసెంట్ గా జరిగినవి.. మరి కొద్ది రోజుల్లో జరగాల్సినవి వరల్డ్ కప్ మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే మెగా టోర్నీ తర్వాతే స్మృతి మంధానకు కెప్టెన్సీ అప్పగించవచ్చు’ అని అన్నారు.

………………………………………..: ఇండియన్‌గా అరుదైన ఫీట్ సాధించిన రోహిత్ శర్మ

గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ కు టీమిండియాను గైడ్ చేశారు రామన్. లాక్ డౌన్ రావడానికి ముందే ఈ టోర్నీ జరిగింది. ఆ తర్వాత రామన్ స్థానాన్ని రమేశ్ పవార్ భర్తీ చేశారు. ప్రస్తుతం టెస్ట్, వన్డే ఫార్మాట్లకు కెప్టెన్ మిథాలీ రాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక టీ20టీమ్ కు మాత్రం హర్మన్ ప్రీత్ కౌర్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు.