కివీస్ ఖతం : అబ్బాయిలేంటి.. అమ్మాయిలూ ఉతికేశారు

టీమిండియా ఇరుజట్లు వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్నాయి. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. కోహ్లీసేన, మిథాలీసేన.. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను పసికూన చేసి ఆట ఆడేసుకున్నాయి.

  • Published By: sreehari ,Published On : January 29, 2019 / 11:01 AM IST
కివీస్ ఖతం : అబ్బాయిలేంటి.. అమ్మాయిలూ ఉతికేశారు

టీమిండియా ఇరుజట్లు వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్నాయి. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. కోహ్లీసేన, మిథాలీసేన.. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను పసికూన చేసి ఆట ఆడేసుకున్నాయి.

మౌంట్ మాంగనూయ్: టీమిండియా ఇరుజట్లు వరుస సిరీస్ విజయాలతో దూసుకెళ్తున్నాయి. అటు అబ్బాయిలు.. ఇటు అమ్మాయిలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. కోహ్లీసేన, మిథాలీసేన.. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను పసికూన చేసి ఆట ఆడేసుకున్నాయి. జనవరి 28న జరిగిన మూడో వన్డేలో విజయం సాధించి సిరీస్ ను కోహ్లీసేన సొంతం చేసుకోగా.. జనవరి 29న జరిగిన మహిళల రెండో వన్డేలో మిథాలీసేన సిరీస్ సొంతం చేసుకుంది. అమ్మాయిలు, అబ్బాయిలు ఇరుజట్లు కివీస్ పైనే విజయం సాధించడం విశేషం. న్యూజిలాండ్ తో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో కివీస్ పై విజయం సాధించింది. ఓపెనర్ స్మృతి మందన (83 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) 90 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో 22ఏళ్ల మందన 105 పరుగులతో సెంచరీ నమోదు చేయగా.. రెండో వన్డేలో 82 డెలవరీలతో మెరిసింది. దీంతో మందనను ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు వరించింది. మరోవైపు కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా అదే దూకుడుతో ఆడుతూ స్మృతికి జోడీగా పరుగులు రాబట్టింది. ఈ మ్యాచ్ లో రాజ్ (111 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్) బాది 63 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేసి నాటౌట్ గా నిలిచింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 162 విజయ లక్ష్యాన్ని మిథాలీ, స్మృతి ద్వయం (35.2 ఓవర్లలో 166/2) అలవోకగా ఛేదించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 44.2 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో మిథాలీసేన 2-0తో ఆధిక్యంలో నిలిచింది. 

మ్యాచ్ ముగిసిన అనంతరం మందన మాట్లాడుతూ.. ‘‘సిరీస్ గెలవడం అద్భుతం. మ్యాచ్ విజయంలో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు నా కంటే వారే అర్హులు. అవార్డును వారికే అంకితం చేస్తున్నా. న్యూజిలాండ్ వికెట్ ను కట్టడి చేయడంలో మా బౌలర్ల శ్రమ ఫలించింది. గ్రేట్ జాబ్’’ అని కొనియాడింది.