ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఇదే.. ఐపీఎల్ హీరోల‌కు ద‌క్కని చోటు

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే ద‌క్షిణాఫికా (South Africa) జ‌ట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది.

ODI World Cup : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు ఇదే.. ఐపీఎల్ హీరోల‌కు ద‌క్కని చోటు

South Africa World Cup squad

South Africa World Cup squad : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే ద‌క్షిణాఫికా (South Africa) జ‌ట్టును సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించింది. మొత్తం 15 మందికి ఈ జ‌ట్టులో చోటు ఇచ్చింది. టెంబా బవుమా (Temba Bavuma) నాయ‌క‌త్వంలో స‌ఫారీలు బ‌రిలోకి దిగ‌నున్నారు. బ్యాట‌ర్లు, బౌల‌ర్లు, ఆల్‌రౌండ‌ర్ల‌తో జ‌ట్టు చాలా ప‌టిష్టంగా స‌మ‌తూకంగా క‌నిపిస్తోంది.

కుర్రాడికి చోటిచ్చారు..

ప్ర‌పంచ‌క‌ప్‌కు ఎంపిక చేసిన జ‌ట్టులో ప్ర‌స్తుతం ఒక్క పేరు అంద‌రిని ఆక‌ర్షిస్తోంది. 22 ఏళ్ల రైట్‌ ఆర్మ్‌ పేసర్‌ గెరాల్డ్‌ కొయెట్జీ. ఈ ఏడాది అంత‌ర్జాతీయ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ ఒక్క ఎంపిక మిన‌హా మిగిలిన అంద‌రి ఎంపిక కూడా దాదాపుగా ఊహించిందే. డేవిడ్‌ మిల్లర్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, క్వింటన్‌ డికాక్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రీజా హెండ్రిక్స్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్లు స‌పారీల సొంతం.

gerald coetzee

gerald coetzee

Rohit Sharma : ది బెస్ట్‌ను ఎన్నుకున్నాం.. ఇక నుంచి నేను మీకు స‌మాధానాలు చెప్ప‌ను

ఐపీఎల్‌ హీరోల‌కు చోటు ద‌క్క‌లే..

ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించి స‌త్తా చాటిన ట్రిస్ట‌న్ స్ట‌బ్స్‌, డెవాల్డ్ బ్రెవిస్‌ల‌కు ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో స్థానం ద‌క్క‌లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఇటీవ‌ల ఆసీస్‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో వీరు విఫ‌లం కావ‌డమే. ప్ర‌పంచ‌క‌ప్ అనంత‌రం వ‌న్డేల నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు డికాక్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌క‌ప్‌లో సౌతాఫ్రికా అక్టోబ‌ర్ 7న శ్రీలంక‌తో త‌న మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. దీనికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.

ప్ర‌పంచ‌క‌ప్‌కు దక్షిణాఫ్రికా జట్టు ఇదే :

టెంబా బవుమా (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, క్వింటన్‌ డికాక్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్‌, రీజా హెండ్రిక్స్‌, కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్‌ కొయెట్జీ, మార్కో జన్సెన్‌, తబ్రేజ్‌ షంషి, కేశవ్‌ మహారాజ్‌

IND vs PAK : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ vs పాక్ మ్యాచ్.. టికెట్ ధ‌ర రూ.57ల‌క్ష‌లు.. ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!