బౌలర్ మ్యాజిక్ : హ్యాండ్ కర్చీఫ్.. కర్రలా మార్చాడు చూడండి!

  • Published By: sreehari ,Published On : December 5, 2019 / 12:09 PM IST
బౌలర్ మ్యాజిక్ : హ్యాండ్ కర్చీఫ్.. కర్రలా మార్చాడు చూడండి!

ఇది మ్యాజిక్ షో కాదండోయ్.. అదో క్రికెట్ గ్రౌండ్. సౌతాఫ్రికా ప్రీమియర్ టీ20 టోర్నమెంట్ లో భాగంగా దర్బన్ హీట్, పార్ల్ రాక్స్ జట్ల మధ్య MSL T20 2019 (Mzansi Super League) జరుగుతోంది. ప్రేక్షకులంతా ఆసక్తికరంగా మ్యాచ్ వీక్షిస్తున్నారు.

ఇంతలో సౌతాఫ్రికా స్పిన్నర్ తబ్రియాజ్ షాంసీ మైదానంలో మ్యాజిక్ ట్రిక్ ప్లే చేశాడు. బంతితో కాదు.. హ్యాండ్ కర్చీఫ్‌ను కర్రలా మార్చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. మ్యాచ్ మధ్యలో డేవిడ్ మిల్లర్ వికెట్ తీసిన ఆనందంలో షాంసీ ఈ మ్యాజిక్ చేసి అందరిని అబ్బురపరిచాడు. సాధారణంగా క్రికెట్ లేదా ఫుట్ బాల్ కావొచ్చు. మ్యాచ్ ఏదైనా ఆటగాళ్ల మైదానంలో సెలబ్రేట్ చేసుకునే విధానం యూనిక్ గా ఉంటుంది.

ఇప్పటివరకూ ఏ ఆటగాడు చేయని రీతిలో మ్యాజిక్ చేసి షాంసీ ఔరా అనిపించాడు. మజాన్సీ సూపర్ లీగ్ 2019 సిరీస్‌లో పార్ల్ రాక్స్ టీ20 జట్టు తరపున తబ్రియాజ్ షాంసీ ఆడుతున్నాడు. దర్బన్ హీట్ జట్టు తరపున ఆడుతున్న విహాబ్ ల్యుబ్బె వికెట్ పడగొట్టిన మైదానంలోనే షాంసీ మ్యాజిక్ ట్రిక్ ప్రదర్శించాడు.

ల్యుబ్బే బంతిని బౌండరీ తరలించినప్పటికీ హర్దాస్ విజోయెన్ సింపుల్ క్యాచ్ పట్టేయడంతో వెనుదిరిగాడు. ఆ తర్వాత వెంటనే దర్బన్ హీట్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ బిగ్ వికెట్ పడగొట్టేశాడు షాంసీ. మిల్లర్ వికెట్ తీసిన ఆనందంలో షాంసీ.. తన చేతిలో రెడ్ హ్యాండ్ కర్చీఫ్ బయటకు తీసి మ్యాజిక్ చేశాడు.

కర్చీఫ్ కాస్తా కర్రలా మారిపోయింది. ఈ మ్యాచ్ లో షాంసీ.. రెండు వికెట్లు తీసుకోగా, నాలుగు ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్నాడు. మిల్లర్ వికెట్ పడినప్పటికీ దర్బర్ హీట్ పార్ల్ రాక్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచింది.

ఈ సీజన్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో మూడు మ్యాచ్ ల్లో గెలిచింది. షాంసీ మ్యాజిక్ చేసిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లంతా ఫన్నీ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. ఇలాంటి గొప్ప సెలబ్రేషన్ ఎన్నడైనా చూశామంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.