Asia Cup 2022: భారత్-శ్రీలంక మ్యాచు షురూ.. భారత జట్టులో ఒకే ఒక్క మార్పు.. ఓపెనర్లుగా క్రీజులోకి కేఎల్ రాహుల్, రోహిత్

ఆసియా కప్‌ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచులో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచుల్లో వరుసగా పాకిస్థాన్‌, హాంకాంగ్‌పై గెలిచిన భారత్.. సూపర్‌-4లో పాక్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది.

Asia Cup 2022: భారత్-శ్రీలంక మ్యాచు షురూ.. భారత జట్టులో ఒకే ఒక్క మార్పు.. ఓపెనర్లుగా క్రీజులోకి కేఎల్ రాహుల్, రోహిత్

Asia Cup 2022

Asia Cup 2022: ఆసియా కప్‌ లో భాగంగా శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దుబాయి వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియా ఈ మ్యాచులో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. తొలి రెండు మ్యాచుల్లో వరుసగా పాకిస్థాన్‌, హాంకాంగ్‌పై గెలిచిన భారత్.. సూపర్‌-4లో పాక్‌ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో టీమిండియాపై ఇది తీవ్ర ప్రభావం చూపింది.

టైటిల్‌ పోరులో నిలవాలంటే నేడు తప్పకుండా మ్యాచ్ గెలవాల్సి ఉండడంతో ఈ మ్యాచులో టీమిండియా అనేక జాగ్రత్తలు తీసుకుంది. శ్రీలంక జట్టు కూడా బలంగా ఉంది. భారత్ జట్టు ఒకే ఒక మార్పులో బరిలోకి దిగింది. రవి బిష్ణోయి స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. భారత జట్టులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కొహ్లీ, సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, దీపక్ హూడా, భువనేశ్వర్ కుమార్, యజువేంద్ర చాహెల్, అర్ష దీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా క్రీజులోకి కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ వచ్చారు.

Strict lockdown in China: భూకంపంతో 65 మంది చనిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నా.. కఠిన లాక్‌డౌన్‌ అమలు చేస్తోన్న చైనా