WTC Final 2023: బాలకృష్ణ డైలాగులు చెబుతూ అదరగొట్టేసిన స్టీవ్ స్మిత్.. వీడియో
" ఫ్లూటు జింక ముందు ఊదు... సింహం ముందు కాదు " అనే డైలాగ్ చెప్పడానికి స్టీవ్ స్మిత్ తడబడ్డాడు. చివరకు..

Steve Smith - Balakrishna dialogues
WTC 2023 Final – Steve Smith: ” అపాయింట్‌మెంట్ లేకుండా వస్తే వకేషన్ చూడను, లొకేషన్ చూడను “, ” డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యు ట్రబుల్ ది ట్రబుల్.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ది ట్రబుల్, ఐయామ్ ట్రుత్ ” అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) డైలాగులు చెప్పారు.
” స్టీవ్ స్మిత్ నోట మన తెలుగు సినిమా డైలాగ్స్.. మరి తనదైన మేనరిజంతో ఎలా అలరించాడో మీరే చూసేయండి ” అంటూ స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అలాగే, ” ఫ్లూటు జింక ముందు ఊదు… సింహం ముందు కాదు ” అనే డైలాగ్ చెప్పడానికి స్టీవ్ స్మిత్ తడబడ్డాడు. చివరకు ” తగ్గేదేలే “.. అంటూ అల్లు అర్జున్ పుష్ప డైలాగ్ ను స్టీవ్ స్మిత్ చెప్పాడు.
ఆస్ట్రేలియా(Australia)లోని ఓవల్ మైదానంలో ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టీవ్ స్మిత్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ తెలుగు సినిమా డైలాగులు చెప్పారు. ఆయనతో యాంకర్ ఈ డైలాగులు చెప్పించింది.
స్టీవ్ స్మిత్ నోట 🥳
మన తెలుగు సినిమా డైలాగ్స్ 😎మరి తనదైన మనేరిజంతో 🔥
ఎలా అలరించాడో మీరే చూసేయండి 😉చూడండి 👀 #WTCFinalOnStar | #AUSvsIND Day 3 Live
మీ 📺 #StarSportsTelugu/HD & Disney+Hotstar లో #BelieveInBlue pic.twitter.com/maudxIGLoJ— StarSportsTelugu (@StarSportsTel) June 9, 2023
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 వేదిక మార్పు.. ఆ ఆలోచన లేదన్న ఐసీసీ